స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళల అభ్యున్నతి కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలను తెచ్చింది. దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు అనేక ప్రత్యేక పథకాలను రూపొందిస్తుంది.
అలాంటి ఓ స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా అస్మిత (Asmita) లోన్ స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం కింద MSMEs రంగానికి చెందిన పరిశ్రమలకు ఎక్కువగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కీం ద్వారా 10 లక్షల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రుణం అందిస్తారు. ప్రస్తుతం దీనికి వడ్డీ రేటు కూడా మార్కెట్లో ఇతర రుణాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇక దీనిని ఏడు సంవత్సరాల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ రుణం అప్లై చేసుకునేందుకు మీకు ఎలాంటి కోలాటరల్ అవసరం లేదు అంటే ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ వ్యాపారం లో భాగం అయినటువంటి ఆస్తులపై మాత్రం హైపోథికేషన్ ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన ప్రాథమిక సెక్యూరిటీగా భావించవచ్చు. ఇక ఈ రుణం అప్లై చేసుకోవాలంటే మహిళల భాగస్వామ్యం 50 శాతం ఉండే పరిశ్రమలు మాత్రమే అప్లై చేసుకోగలవు. అంటే ఆ కంపెనీలో 50% వాటా మహిళల పేరిట ఉండాలి.
ఈ డబ్బును మీ పరిశ్రమల విస్తరణకు అదేవిధంగా యంత్రాల కొనుగోలుకు, వ్యాపార విస్తరణకు వినియోగించాల్సి ఉంటుంది. అస్మిత లోన్ పూర్తిగా ఆన్ లైన్ డిజిటల్ పద్ధతిలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసం GSTIN, బ్యాంక్ స్టేట్మెంట్లు, క్రెడిట్ స్కోర్ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. మీ పూర్తి డేటా వెరిఫై అయిన అనంతరం లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ లోన్ అప్లై చేసుకోవడానికి, SBI అధికారిక వెబ్‌సైట్‌లో SBI Asmita పేజీని క్లిక్ చేయాలి. లేదంటే మీకు సమీపంలోని SBI బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.
































