పిల్లల పేరిట మంచి పోస్ట్ ఆఫీస్ స్కీం కోసం వెతుకుతున్నారా.. అయితే ఈ స్కీం మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇది మీ పిల్లల పేరిట ప్రతినెల 180 రూపాయల నుంచి 540 రూపాయల వరకు పోస్ట్ ఆఫీస్ లో కడితే చాలు వారికి 20 సంవత్సరాలు వచ్చేసిన సమయానికి పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది.
ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులు, చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు భద్రత వంటి అంశాలపై ప్లాన్ చేసుకునేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుంది.
ఈ స్కీం పేరు బాల్ జీవన్ బీమా పథకం దీని కింద, పిల్లలకు భవిష్యత్తులో చదువు, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసం ఒక రిస్క్ కవర్‌తో పాటు పొదుపు కూడా చేసేందుకు రూపొందించబడిన బీమా పథకంగా చెప్పవచ్చు. ఈ స్కీం కోసం పిల్లల వయస్సు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకూ ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి.
పాలసీ పూర్తయిన మొత్తాన్ని పీరియడ్ అనంతరం పూర్తిగా తిరిగి పొందే అవకాశం కల్పిస్తుంది. పాలసీదారుడికి దురదృష్టకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు వారికి కవరేజీ లభిస్తుంది. తక్కువ ప్రీమియంతో ఉండే మంచి కవరేజీ ఉన్న బీమా పాలసీ ఇదే అని చెప్పవచ్చు. ఈ స్కీం కోసం మీ స్థానిక పోస్టాఫీసులో వివరాలు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల ఆధార్, పిల్లలు పుట్టిన సర్టిఫికెట్, ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం అవుతాయి.
మీరు నెలకు రూ. 540 చొప్పున పిల్లల పేరిట నెలకు 15 సంవత్సరాలపాటు అంటే పిల్లవాడి వయస్సు 5 నుండి 20 ఏళ్లు వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే, మీకు మొత్తం రూ. 97,200 కడతారు. కాగా మీకు మెచ్యూరిటీ అనంతరం రూ. 1,44,336 లబించే వీలుంది. పాలసీ పూర్తయిన అనంతరం పిల్లవాడి తల్లిదండ్రులు ఈ డబ్బు మొత్తం పొందుతారు. పాలసీ మధ్యలో అనుకోని సంఘటనలు ఎదురైనట్లయితే మీకు పాలసీలో ఎంత హామీ పొందారో అంత మొత్తం లభించే అవకాశం ఉంటుంది.
































