ఆధునిక సాంకేతికత, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉంటాయోమోనని వెనుకడుగు వేస్తారు. అయితే ఇలాంటి వారందరికీ అమెజాన్ శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సూపర్ డిస్ ప్లే, మెరుగైన ప్రాసెసర్, స్పష్టమై విజువల్స్ అందించడం వీటి ప్రత్యేకతలు. కేవలం రూ.30 వేల లోపు ధరలోనే 32 అంగుళాల నుంచి 55 అంగుళాల టీవీలు లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
అసర్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ బెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరకు అందుబాటులో లభిస్తోంది. క్యూఎల్ఈడీ స్క్రీన్ తో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏఐ పిక్చర్ ఆఫ్టిమైజేషన్ తో సీన్ కలర్, కాంట్రాస్ట్ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. గేమింగ్ కూ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏఎల్ఎల్ఎం ద్వారా సినిమాలు, గేమ్ విజువల్స్ చక్కగా స్పష్టంగా ఉంటాయి. డాల్బీ అట్మోస్ మద్దతు కలిగిన 80 డబ్ల్యూ హై ఫిడిలిటీ స్పీకర్లు అదనపు ప్రత్యేకత. సినిమాలు, షోలు, వినోద కార్యక్రమాలను చక్కగా వీక్షించవచ్చు. అమెజాన్ లో రూ.24,999కి ఈ టీవీని కొనుగోలు చేసుకోవచ్చు.
తక్కువ ధరకు మంచి ఫీచర్లు కలిగిన టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంఐ షియోమి మంచి ఎంపిక. 43 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ఎల్ఈడీ టీవీ ఏ55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై నడుస్తుంది. లాగ్ ఫ్రీ విజువల్స్ కోసం 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో తీసుకువచ్చారు. వివిధ యాప్ లు, గేమ్ లు, స్ట్రీమింగ్ సేవలను చాలా సులువుగా పొందవచ్చు. మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్టులు, ఏఎల్ఎల్ఎం, ఈఏఆర్సీ, ఆఫ్టికల్ పోర్టు తదితర బహుళ కనెక్టివీటీకి అవకాశం ఉంది. ఈ టీవీ అమెజాన్ లో రూ.23,999 ధరకు లభిస్తుంది.
ఇంటికి అందాన్నివ్వడంతో పాటు అత్యుత్తమ పనితీరు కనబర్చే స్మార్ట్ టీవీలలో సోనీ బ్రావియా ముందుంటుంది. దీనిలోని హెచ్ డీ రెడీ స్క్రీన్ రిజల్యూషన్ తో విజువల్స్ ను చాాలా స్పష్టంగా చూపిస్తుంది. చిత్రానికి అనుగుణంగా రంగులను చూపించే లైవ్ కలర్ టెక్నాలజీ, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్టులు, హై స్పీడ్ బ్ల్యూటూత్ తదితర ఫీచర్లు బాగున్నాయి. సినిమాలు, ఆటలు, షోలు, సంగీతం, వినోద కార్యక్రమాలను చక్కగా వీక్షించవచ్చు. ఓపెన్ బాఫిల్ స్పీకర్, అంతర్నిర్మిత వాయిస్ కమాండ్ అదనపు ప్రత్యేకతలు. 32 అంగుళాల ఈ టీవీ అమెజాన్ లో రూ.26,999 ధరకు అందుబాటులో ఉంది.
దేశంలోని ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన టీసీఎల్ నుంచి రూ.29,990కే 55 అంగుళాల స్మార్ట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. సినిమా థియేటర్ అనుభవాన్ని అందించే ఈ 4 కే స్మార్ట్ టీవీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. లాగ్ ఫ్రీ ప్రాసెసింగ్ ఫీచర్ తో సినిమాలు, గేమ్ లను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు. 178 డిగ్రీల వీక్షణ కోణం, మెటాలిక్ బెజెల్ – లెస్ డిజైన్, డైనమిక్ కలర్ ఎన్ హాన్స్ మెంట్ అదనపు ప్రత్యేకతలు. మూడు హెచ్ డీఎంఐ, ఒక యూఎస్ బీ పోర్టులు, ఈథర్నెట్, హెడ్ ఫోన్ అవుట్ పుట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సినిమాలు, షోలు, వినోద కార్యక్రమాలను చక్కగా చూడవచ్చు. అమెజాన్ లో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
సామాన్యులకు అందుబాటులో ఉంటే ధరలో, బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందించడం వీయూ బ్రాండ్ ప్రత్యేకత. ప్రస్తుతం రూ.29,490కే 50 అంగుళాల 4 కె స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలోని గ్లోక్యూఎల్ఈడీ స్క్రీన్ తో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. క్రికెట్, గేమ్ తదితర బహుముఖ మోడ్ లతో తీసుకువచ్చారు. దీనిలోని గేమ్ మోడ్ కు ఏఎల్ఎల్ఎం, వీఆర్ఆర్ కు మద్దతు ఇస్తుంది. తద్వారా లాగ్ ఫ్రీ విజువల్స్ చూడవచ్చు. స్ట్రీమింగ్ యాప్ లు, గేమ్ లు, బ్రౌజర్లకు మద్దతు లభిస్తుంది. సినిమాలు, సంగీతం, షోలు, గేమ్ లు తదితర అన్ని రకాల కంటెంట్ ను చక్కగా వీక్షించవచ్చు. అమెజాన్ లో ఈ టీవీ అందుబాటులో ఉంది.
































