బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌లో సహజ కొవ్వులు, ప్రోటీన్లు మరియు శక్తినిచ్చే పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు లేదా స్మూతీలలో చేర్చవచ్చు. పోషకమైన ఆహారం తినాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
అవకాడోలో సహజంగా కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ పండ్లను సలాడ్లు, శాండ్విచ్లు, స్మూతీలలో చేర్చడం వల్ల శరీరానికి సరైన మొత్తంలో శక్తి లభిస్తుంది. బరువు పెరగాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది.
చీజ్ ఒక శక్తివంతమైన ఆహారం. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన కొవ్వులను కూడా అందిస్తుంది. సలాడ్లు, పాస్తా, శాండ్విచ్లు వంటి వంటకాలతో చీజ్ తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇది రుచిని కూడా జోడిస్తుంది.
































