పొడవాటి జుట్టు రహస్యం.. ఇలా రోజ్ వాటర్ రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు

రోజ్ వాటర్‌లో విటమిన్ ఎ, బి3, సి , విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు రోజ్ వాటర్‌ అప్లై చేయటం వల్ల సహజ మెరుపును అందిస్తుంది.


వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. రోజ్‌ వాటర్‌ కుదుళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది. అధిక నూనెను గ్రహించేస్తుంది. అంతేకాదు రోజ్‌ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కుదుళ్ల దురదను తగ్గించేస్తుంది. చుండ్రుతో చికాకు కూడా ఉండదు. రోజ్‌ వాటర్‌ జుట్టుకు ఉపయోగించడం వల్ల సోరియాసిస్‌, ఎగ్జీమా వంటి సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్యను కూడా రోజ్‌ వాటర్‌ తగ్గిస్తుంది. ఇందులో కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు ఉంటాయి.

రోజ్‌ వాటర్‌ని తలకు అప్లై చేయటం వల్ల ఇది తల చర్మాన్ని శుభ్రపరిస్తుంది. జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. ఇందుకోసం తలచర్మానికి రోజ్‌వాటర్‌ నేరుగా అప్లై చేయవచ్చు అంటున్నారు నిపుణులు. తలంతటికీ రోజ్ వాటర్‌ అప్లై చేసిన తరువాత రెండు, మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల తలలో రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది. తలను కిందికి వంచి రోజ్ వాటర్‌తో తలచర్మాన్ని మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల రక్తప్రసరణను వేగంగా పెంచుతుంది.

ఇందుకోసం మీ తలకు సరిపడా రోజ్ వాటర్‌, ఆలివ్ ఆయిల్ లేదంటే కొబ్బరినూనె కలిపి హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. స్మూత్‌గా మాసాజ్‌ చేసుకుని 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తరువాత తేలిక పాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.