ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తంతో పాటుగా మార్గదర్శకాలు సిద్దం చేసింది. తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం జూన్ 12 నాటికి ఏడాది పాలన పూర్తి చేసుకో నుంది. ఈ సమయంలోనే అర్హత ఉన్న వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది.
ముహూర్తం ఫిక్స్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలి పారు. జూన్ 12వ తేదీ నుంచి వీరందరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం దాదా పు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది. సెర్ప్ అధికారుల నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు. అదే విధంగా సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ను ప్రకటించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు.
అర్హులకు పంపిణీ కాగా, 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన సరే పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. అనర్హులకి తొలగింపు పెన్షన్ల మంజూరు సమయంలోనూ అనర్హులను తెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధ్రువీకరణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి రూ.30 వేల వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ అసెస్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. స్పౌజ్ పింఛన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో స్వీకరించనున్నారు.
నెలకు రూ 4 వేలు అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది. అనర్హులను తెలిగించి.. అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు రూ. 35.91కోట్ల అదనపు భారం పడనుంది. జులై నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది. అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలలో పెన్షన్లు నిలిచిపోయిన వారికి ఉపశమనం దక్కనుంది.
































