సాధారణంగా పాములు కాటేస్తాయి. కొండచిలువ మాత్రం చుట్టగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చక్కర్లు కొడుతుంటాయి.
భూమి మీద ఉన్నా నీళ్లలో ఉన్నా కొండచిలువతో పెట్టుకుంటే ప్రాణాలు మటాష్ కావాల్సిందే. నీళ్లలో ఉండే మొసళ్లకు, భూమి మీద ఉండే ఏనుగులకు సైతం కొండ చిలువలు చుక్కలు చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్‌గా మారిన ఓ వీడియోలో పెద్ద కొండచిలువ ఒకటి ఓ పులిని మింగడానికి తెగ ట్రై చేసింది. తన నోట్లో మొత్తం పులి తలను పెట్టుకుని గుటుకేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆఖరికి జరిగిన సన్నివేశం చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఓ పులి.. ఆకలితో ఉన్న పెద్ద కొండచిలువ కంటపడుతుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది. పులిని అమాంతం మింగేందుకు ప్రయత్నించింది. కొండచిలువ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి విరమించుకుంటుంది. ఇలా చాలా సేపు పులిని అలాగే నోటితో పట్టుకుని ఉంటుంది. ఈ ఘటనలో పులి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అంతా భావిస్తారు. ఆ వెంటనే అంతా అవాక్కయ్యే సీన్ కనపడుతుంది. అప్పటిదాకా పులిని చంపేయడానికి ప్రయత్నించిన కొండచిలువ.. ఆ తర్వాత దాన్ని వదిలేసి దానికి దిండుగా మారిపోయింది. దీంతో పులి చివరకు కొండచిలువపై తల పెట్టి హాయిగా నిద్రపోయింది. ఈ ఘటన నెటిజన్స్‌ను అవాక్కయ్యేలా చేసింది.
ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కళ్లకు కనపడేది ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోలేనంతగా తయారైంది పరిస్థితి. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు అంతా కనికట్టు మాయ. అలాంటి వీడియోలు రోజుకు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా నెటిజన్స్‌ను వణికిస్తుంటాయి
































