నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో కోర్టు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తంగా 1620 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మాత్రం మే 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యి జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు..

1620

ముఖ్యమైన పోస్టులు..

జూనియర్‌ అసిస్టెంట్‌ – 230

ఆఫీస్‌ సబార్డినేట్‌ – 651

ప్రాసెస్‌ సర్వర్‌ – 164

రికార్డ్‌ అసిస్టెంట్‌ – 24

కాపీయిస్ట్‌ – 193

ఎగ్జామినర్‌ – 32

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – 56

టైపిస్ట్‌ – 162

స్టెనోగ్రాఫర్‌ – 80

డ్రైవర్‌ – 28

విద్యార్హతలు..

సబార్డినేట్ పోస్టులు – కనీసం 7వ తరగతి

జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ – డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. టైపింగ్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ – ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హత అవసరం.

వయస్సు పరిమితి..

అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి.

రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు..

OBC, EWS అభ్యర్థులకు – ₹800

SC, ST, దివ్యాంగులు – ₹400

ఎంపిక విధానం..

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉంటాయి.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://aphc.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.