అన్నదాత సుఖీభవ పథకం 2025 విడుదల తేదీ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి శుభవార్త అందించింది. జూన్ 12, 2025 నాటికి అన్నదాత సుఖీభవ పథకంను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు వార్షికంగా రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నారు.


ఆర్థిక సాయంలో విభజన:

  • ₹6,000 – కేంద్రం నుంచి (PM-Kisan యోజన ద్వారా)
  • ₹14,000 – రాష్ట్ర ప్రభుత్వం నుంచి

ఈ మొత్తం సాయం మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

అర్హతలు ఇవే:

  • కనీసం 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు
  • భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు లేదా పాసుపుస్తకం అవసరం
  • ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి
  • రైతు పంటల వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాలి
  • కౌలు రైతులకు పథకం వర్తించేందుకు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి

    అవసరమైన డాక్యుమెంట్లు:

    1. ఆధార్ కార్డు
    2. బ్యాంక్ పాస్‌బుక్ (ఆధార్ లింక్ అయి ఉండాలి)
    3. భూమి పత్రాలు / పట్టాదారు పాసుపుస్తకం
    4. రైతుగా నమోదు చేసిన పత్రాలు
    5. కౌలు రైతులైతే లీజు ధ్రువీకరణ పత్రం
    6. అన్నదాత సుఖీభవ కోసం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
    7. డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవడం ఉత్తమం
    8. ఈ పథకం PM-Kisan కు అర్హులైన వారందరికీ వర్తిస్తుంద
    9. ఈ పథకం ద్వారా రైతులకు గట్టి ఆర్థిక మద్దతు లభించనుంది. అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా మీ గ్రామ వాలంటీర్‌ను సంప్రదించండి..ముఖ్యమైన సూచనలు:
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.