ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ఎనర్జిటిక్‌గా రోజును ప్రారంభించాలనుకుంటే ముందుగా తీసుకునే ఫుడ్ మంచిదై ఉండాలి. దానిని ఓ డ్రింక్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ హెర్బల్ డ్రింక్స్‌ని మీ డైట్లో చేర్చుకోవాలి.
అయితే ఏ హెర్బల్ డ్రింక్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు వాటర్..
సోంపును రాత్రుళ్లు నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే మరిగించుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదట. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మెటబాలీజం పెంచుతుంది. అంతేకాకుండా హైడ్రేషన్‌ను శరీరానికి అందిస్తుంది.
ఎండుద్రాక్షలతో..
ఎండుద్రాక్షలను రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది. ఈ నీటిలో ఎండుద్రాక్షల పోషకాల చేరి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీకు రోజంతా శక్తిని అందిస్తుంది.
ధనియాల నీరు..
ధనియాలను రాత్రుళ్లు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలోని మలినాలు డీటాక్స్ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది సమ్మర్లో హైడ్రేషన్‌ను అందిస్తుంది.
బెండకాయ నీరు
బెండకాయను ముక్కలుగా కోసి ఓ గ్లాసు నీటిలో నానబెట్టాలి. దానిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణక్రియకు మద్ధతునివ్వడంతో పాటు హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది. జుట్టుకు పోషణ అందిస్తుంది.
మెంతి నీరు
మెంతులను కూడా రాత్రి నానబెట్టి.. మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. వాపును తగ్గించి.. జీవక్రియను పెంచుతుంది. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
జీలకర్ర నీరు
జీలకర్రను నీటిలో నానబెట్టి తీసుకున్నా లేదా ఉదయాన్నే నీటిలో మరిగించి తీసుకున్నా.. ఆరోగ్యానికి మంచిదే. ఇది బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచింది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది.
బార్లీ నీరు
బార్లీ వాటర్ మూత్రపిండాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పోషకాలతో నిండిన ఈ డ్రింక్.. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. హైడ్రేషన్‌ని అందించి.. జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది.
ఇవే కాకుండా మీరు వామ్ము నీరు, పుదీనా నీటితో కూడా రోజును ప్రారంభించవచ్చు. ఇవి మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. కానీ మంచి ప్రయోజనాలు ఇస్తాయి. కాబట్టి రోజును వీటితో ప్రారంభిస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
































