డోలో టాబ్లెట్ వినియోగదారులకు కీలక అప్‌డేట్.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

పరిచయం అక్కర్లేని ట్యాబ్లెట్. మన దేశంలో ఈ పేరు చాలా మందికి తెలుసు. ముఖ్యంగా కోవిడ్ 19 సమయంలో డోలో ట్యాబ్లెట్లను భారీ ఎత్తున కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకున్నారు.


చిన్న జ్వరం వచ్చినా సరే కోవిడ్ వచ్చిందన్న అనుమానంతో వెంటనే డోలో ట్యాబ్లెట్లు వేసుకునేవారు. ఆ విధంగా డోలో ట్యాబ్లెట్ చాలా ఫేమస్ అయ్యింది. నోరు తిరగని వారు కూడా ఈ డోలో ట్యాబ్లెట్ పేరు చాలా సులభంగా పలుకగలుతున్నారు. ఈ ట్యాబ్లెట్ పాపులర్ అవ్వడం వెనకున్న కారణాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే డోలో ట్యాబ్లెట్లను ప్రస్తుతం చాలా మంది డాక్టర్ సూచనలు లేకుండా అధిక మొత్తంలో వాడుతున్నారని ఇటీవలే చేపట్టిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డోలో ట్యాబ్లెట్లను అధికంగా వాడుతున్నవారు లేదా డాక్టర్ సూచన లేకుండా వాడుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డోలో టాబ్లెట్లు 650 మిల్లీగ్రాముల మోతాదులో పారాసెటిమాల్ ఉంటుంది. టాబ్లెట్లలో డోలో కూడా ఒకటి అని చెప్పవచ్చు. విదేశాల్లో పారిసెటిమాల్ ను అసిటా మోనోఫైన్గా వ్యవహరిస్తారు. అంటే శరీరంలో ఆయా భాగాల్లో వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఈ డోలో టాబ్లెట్లు సహాయం చేస్తాయి. అలాగే ఈ టాబ్లెట్లు యాంటీ పెరటిగా కూడా పనిచేస్తాయి. అంటే జ్వరాన్ని తగ్గిస్తాయి అని చెప్పవచ్చు. మెడికల్ షాప్ లోను డోలో టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయి. అందుకే ప్రజల్లో ఇవి బాగా పాపులర్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు, వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు లేదా పలు ఇతర కారణాల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు డోలో టాబ్లెట్లు ఉపయోగిస్తుంటారు. డోలో టాబ్లెట్లను వాడితే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, దంతాల నొప్పి, చెవినొప్పి మహిళలకు వచ్చే రుతుక్రమ నొప్పి వంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

డోలో టాబ్లెట్లను 12 సంవత్సరాల పైబడిన వారికి డాక్టర్లు సూచిస్తుంటారు. డోలో ఒక టాబ్లెట్ డోసు 650 మిల్లీగ్రామ్ లు ఉంటుంది. రోజుకు నాలుగు ట్యాబ్లెట్లు గరిష్టంగా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది. అయితే 24 గంటల వ్యవధిలో డోలో టాబ్లెట్ డోసు 1950 ఎంజి మాత్రమే. అంటే రోజుకు మూడు టాబ్లెట్లు మాత్రమే వేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఆరు గంటలకు లేదా నాలుగు గంటలకు ఒకటి వాడాలని కేవలం డాక్టర్లు మాత్రమే చెబుతుంటారు. కానీ కొందరు ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా డోలో టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడడం శరీరంపై దుష్ప్రప్రభావాలు కలుగజేస్తుందని వైద్యులు చెబుతున్నారు. డోలో టాబ్లెట్లు తీసుకున్న తర్వాత అరగంట నుంచి నొప్పులు జ్వరం తగ్గడం మొదలవుతాయి. ఒక టాబ్లెట్ పవర్ శరీరంలో నాలుగు నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుంది.

అధికంగా వాడితే ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరంపై దద్దుర్లు, దురదలు కూడా వస్తాయి. లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీల పనితీరు దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది. రక్తసంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. లివర్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సూచన లేకుండా డోలో టాబ్లెట్ ను వాడకూడదు. లేదంటే సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. డోలో టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించకూడదు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతున్న వారు డోలో టాబ్లెట్ను వాడాల్సి వస్తే డాక్టర్ కి విషయం ముందుగా చెప్పాలి. లేదంటే రెండు మెడిసిన్స్ కు సరిపోక అలర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సూచన మేరకు మాత్రమే డోలో 650 టాబ్లెట్లు వాడాలని చెబుతున్నారు. ఈ టాబ్లెట్ను కేవలం కొద్ది రోజులు మాత్రమే డాక్టరు సూచిస్తారు. ఎక్కువ కాలం ఈ టాబ్లెట్లు వాడకూడదు. డోస్ అధికమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కో వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.