పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో పీఎం కిసాన్ రెండో విడత కింద రూ.2 వేలను ప్రభుత్వం ఇస్తోంది.
అయితే పీఎం కిసాన్ డబ్బుల తప్పకుండా రావాలంటే రెండు కండీషన్లు పాటించాలి. ఫస్ట్ మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ ఉండాలి. గతం విడతలో డబ్బులు తీసుకుని ఉంటే మీ కేవైసీ పూర్తి అయి ఉంటుంది.
ఈ కార్డు ఉన్న రైతులకు మాత్రమే..
ఇదే మొదటసారి అయితే కేవైసీ తప్పకుండా చేయించుకోవాలి. అలాగే విశిష్ట గుర్తింపు కార్డు కూడా ఉండాలి. ఇది కనుక లేకపోతే అసలు పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లోకి చేరవు. ఈ విశిష్ట గుర్తింపు కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారు. కార్డు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. వచ్చే నెలలో పీఎం కిసాన్ డబ్బులు రానున్నాయి. ఈ క్రమంలో రైతులు పీఎం కిసాన్ ఈకేవైసీ, విశిష్ట గుర్తింపు కార్డును పొంది ఉండాలి.
ఈ విశిష్ట గుర్తింపు కార్డు పొందాలంటే రైతులు తమ భూ యాజమాన్య పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో దగ్గర్లోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి చేసుకోవాలి. ఇది రైతుకి శాశ్వత ఐడీగా పనిచేస్తుంది.
































