మంచు ఫ్యామిలీ వివాదాలతో రోడ్డున పడింది. అటు మోహన్ బాబు, విష్ణు.. మనోజ్ తప్పు చేశాడంటే.. ఇటు మనోజ్ తనను బొమ్మలా వాడుకున్నారని ఆరోపణలు చేశాడు.
ఆస్తుల గురించి గొడవపడ్డారు. ఇంటి దగ్గరే నిరసనలకు దిగారు. ఇదంతా ఇలా ఉంటే మనోజ్ ‘భైరవం’ సినిమా ద్వారా గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగ్గా.. తనను కట్టుబట్టలతో బయటకు నెట్టేశారని ఏడ్చాడు. అంతకు ముందే మనోజ్‌కు సంబంధించిన వీడియో ప్లే చేయడంతో ఎమోషనల్ అయ్యాడు.
తన సినిమాలకు సంబంధించిన ఏవీ ప్లే చేయడంతో కన్నీరు పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. డైరెక్టర్ ఓదార్చినా సరే సంభాలించుకోలేకపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్ బ్యాక్ కావాలని.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, మరిన్ని ఆఫర్స్‌తో దూసుకెళ్లాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా.. హీరోయిన్ మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పోస్ట్ పెట్టింది. తన తమ్ముడు మనోజ్‌కు మంచి హిట్ పడాలని కోరుకుంటూ.. ఇందుకు సంబంధించిన ట్రైలర్ షేర్ చేసింది.
































