ఇక చార్జింగ్ ద్వారా నడిచే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకోవాలని భావిస్తుంటే.. వాటి ధర ఓ రేంజ్ లో ఉంది. మొత్తంగా వాహనం అనే ఆలోచన మన మదిలోకి వస్తే చాలు వణుకు పుడుతుంది. అందుకే చాలామంది వాహనాలు కొనాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రూపంలో ప్రయాణం సాగిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ కంపెనీ కారును రూపొందించింది. ఇందులో పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు. డీజిల్ నింపాల్సిన ఖర్మ లేదు. చివరికి చార్జింగ్ పెట్టాల్సిన అగత్యం కూడా లేదు. అయితే ఇదేదో విఠలాచార్య సినిమాలో మాయా వాహనం కాదు. సంకేతం ఇస్తే చాలు దూసుకుపోవడానికి ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమాలోని ప్రత్యేక వాహనం కూడా కాదు..
వాహనం ప్రత్యేకతలు ఏంటంటే..
ఇంధనం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మనదేశంలో సగటు మధ్యతరగతి జీవికి కారు కలను నెరవేర్చడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ కారులో ఇంధనం పోయాల్సిన అవసరం లేదు. చార్జింగ్ పెట్టాల్సిన ఖర్మ కూడా లేదు. ఈ కారు ధర 3.25 లక్షలు. ప్రస్తుతం ఒక 5000 చెల్లిస్తే 2000 26 నాటికి డెలివరీ చేస్తారు. ఇది 5 సెకండ్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు సోలార్ ఎలక్ట్రిక్ విధానంలో నడుస్తుంది. ఈ కారుకు లాప్టాప్ చార్జర్ ఉంటుంది. లిక్విడ్ బ్యాటరీ కూలింగ్ సిస్టం.. పనోరమిక్ గ్లాస్ వన్ రూఫ్.. యాపిల్ కార్ ప్లే… ఆండ్రాయిడ్ ఆటో టిఎం వంటి ఎన్నో సదుపాయాలు ఈ కారులో ఉంటాయి. ఈ కారు పైన లాప్టాప్ చార్జర్ ఉండడంతో.. మండే ఎండలే ఇంధనంగా ఉపయోగించుకుని ఈ కారు నడుస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ కారును అత్యంత సులభంగా తీసుకోవచ్చు. ఈ కారు పైన ఉండే సోలార్ రూఫ్ ఏడాదికి 3,000 కు పైగా కిలోమీటర్ల ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తుంది. సోలార్ రూఫ్ వల్ల మండే ఎండలను ఈ కారు ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. అంటే ఎంత ఎండ ఎక్కువుంటే.. ఈ కారుకు అంత ఇంధనం అన్నమాట.. అందువల్లే ఈ కారుకు వచ్చే రోజుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు ఈ కారును సొంతం చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికి బుకింగ్స్ వేల సంఖ్యలో చేరుకున్నట్టు కారు తయారీదారులు చెబుతున్నారు. అయితే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్లకు జోడించే ఏర్పాటు చేస్తున్నామని తయారీదారులు వివరిస్తున్నారు.
































