ఈ బుల్లి SUVలు చాలా బాగున్నాయి.. దాదాపు ఒకేలాంటి ఫీచర్లు కలిగిన రెండు కార్లు

మన దేశంలోని కార్ల మార్కెట్ లో వివిధ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ప్రజల అవసరాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివిధ మోడళ్ల వాహనాలు తయారవుతున్నాయి. నేటి కాలంలో మధ్యతరగతి ప్రజలు కూడా కార్లను వినియోగిస్తున్నారు. వారి ఆదాయ స్థాయికి అనుగుణంగా అందుబాటు ధరల్లో లభించడమే దీనికి కారణం. పెట్రోలు, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్.. ఇలా అనేక విభాగాల్లో కార్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయగలిగే కార్లలో సీట్రోయెన్ సీ3, టాటా పంచ్ ముందుంటాయి. సీఎన్జీ విభాగంలో కూడా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటి మధ్య తేడాలు, ధర, ఇతర ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ కంపెనీ నుంచి విడుదలైన సిట్రోయన్ సీ3 కారును మన దేశ మార్కెట్ కు అనుగుణంగా తయారు చేశారు. దీన్ని ఇటీవల సీఎన్జీ పవర్ ట్రెయిన్ ఎంపికతో ఆధునీకరించారు. అయితే సీఎన్జీ కిట్లను డీలర్ స్థాయిలో ఇన్ స్టాల్ చేస్తారు. మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న మారుతీ బాలెనో, ఇతర ప్రీమియం హ్యచ్ బ్యాక్ లకు సిట్రోయెన్ సీ3 పోటీగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టాటా పంచ్ తో ప్రధాన పోటీ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండింటినీ బేబీ ఎస్ యూవీలుగా భావించవచ్చు. స్లైల్, పవర్ ట్రెయిన్, ఇతర లక్షణాలలో ఒకే విధంగా కనిపిస్తాయి.


ధర

  • సిట్రోయెన్ సీ3 కారు రూ.6.23 లక్షల(ఎక్స్ షోరూమ్)కు అందుబాటులోకి వచ్చింది. అదనంగా మరో రూ.93 వేలు చెల్లించి సీఎన్జీ కిట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగిన లైవ్, ఫీల్, ఫీల్ (ఓ), ఫైన్ వేరియంట్ల కోసం ప్రత్యేకంగా ఈ కిట్లను తయారు చేశారు.
  • టాటా పంచ్ ఐసీఎన్జీ కారు ధర రూ.7.30 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ప్రత్యేకతలు

  • సిట్రోయెన్ సీ3 కారులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీనికి ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. ఇంజిన్ నుంచి రూ.81 బీహెచ్ పీ, 115 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. ఇక సీఎన్ జీ ఎంపికతో వాస్తవ అవుట్ పుట్ ను కంపెనీ తెలపలేదు. అయితే ఫ్యాక్టరీ పరీక్షించిన కిట్లు 28.1 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయని చెబుతున్నారు.
  • టాటా పంచ్ లో 1.2 లీటర్ల మూడు సిలిండర్ల ఇంజిన్ ఏర్పాటు చేశారు. పెట్రోలుతో నడిచేటప్పుడు 84.82 బీహెచ్ పీ శక్తి, 113 ఎన్ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీలో వాడినప్పుడు అవుట్ పుట్ 72.39 బీహెచ్పీ, టార్క్ 103 ఎన్ఎంకి తగ్గుతుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, లేదా 5 స్పీడ్ ఏఎంటీకి ఇంజిన్ ను జత చేశారు. టాటా పంచ్ ప్యూర్ ఐసీఎన్ జీ సుమారు 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

తక్కువ ఖర్చు

సాధారణంగా పెట్రోలు, డీజిల్ తో కార్లు నడుస్తాయి. ఇటీవల ఎలక్ట్రిక్ కార్లకు కూడా డిమాండ్ పెరిగింది. అయితే పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతుండడంతో మధ్యతరగతి ప్రజలకు కారు నిర్వహణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎన్ జీ వాహనాలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. పెట్రోలు, డీజిల్ తో పోల్చితే సీఎన్ జీ ఖర్చు తక్కువ. అలాగే ఎక్కువ మైలేజీని అందిస్తాయి. పర్యావరణానికి కూడా ఏమాత్రం నష్టం కలిగించవు. ఈ నేపథ్యంలో సీఎన్ జీ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.