ఆయుర్వేద రారాజు ‘అశ్వగంధ’తో ‘షుగర్’ అదుపులో ఉంటుందా?

భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో కేవలం అనారోగ్య సమస్యలకు ఉపాయాలు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే దాన్ని గురించీ కూలంకశంగా వివరించారు. మనకు విరివిగా అందుబాటులో ఉండే వాటి నుంచి అరుదుగా లభించే వస్తువుల వరకు వాటి ప్రయోజనాలను ఆయుర్వేదంలో క్షుణ్ణంగా తెలిపారు. ఈ క్రమంలోనే ఆయుర్వేదంలో ప్రముఖంగా అశ్వగంధ గురించి కూడా ప్రస్తావించారు. ఇంతకీ అశ్వగంధ అంటే ఏంటి? దీని రోజు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం!


అశ్వగంధ అంటే : అశ్వగంధను ‘మూలికల రారాజు’ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో దీనిని వినియోగిస్తున్నారు. దీన్నే భారతీయ జిన్సింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా, ఆఫ్రికాలో పెరిగే ఒక సతత హరిత పొద, దీన్ని శాస్త్రీయంగా విటానియా సోమ్మిఫెరా అని పిలుస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే,

ఒత్తిడి, ఆందోళన దూరం : అశ్వగంధను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని National institutes of Health పేర్కొంది. ఎందుకంటే ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

డయాబెటిస్​ కంట్రోల్​ : మధుమేహంతో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే అశ్వగంధ డయాబెటిక్ రోగులలో ఇన్సులిన్ సెన్సిటివిటీని, మొత్తం జీవక్రియ ప్రొఫైల్‌లను పెంచుతుందని National Library of Medicine పేర్కొంది.

కండరాల పెరుగుదల : అశ్వగంధ కండరాల బలాన్ని పెంచడానికి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న అడాప్టోజెనిక్ లక్షణాలు శారీరక ఒత్తిడికి, శరీరం ప్రతిస్పందనకు మద్ధతు ఇస్తాయని పేర్కొన్నారు. అశ్వగంధ సప్లిమెంటేషన్ కండరాల ద్రవ్యరాశి, బలాన్ని గణనీయంగా పెంచుతుందని National Library of Medicine పేర్కొంది. ఇది మెరుగైన వ్యాయామ పనితీరుకు దారితీస్తుందని తెలుపుతున్నారు.

గుండె ఆరోగ్యం : అశ్వగంధను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు అశ్వగంధ తీసుకున్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయులు చాలా వరకు తగ్గినాయని, ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడినట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. అలాగే అశ్వగంధ అధిక రక్తపోటును తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

నిరాశకు చెక్ : అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజ సిద్ధ మూడ్ బూస్టర్​గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ లాంటి ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయులను తగ్గించి నిరాశ నుంచి బయటపడేస్తుందని వివరిస్తున్నారు.

అలసట నుంచి రిలీఫ్ : తగినంత విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపించడం, బద్ధకం వంటి సమస్యలకు అశ్వగంధ దివ్యమైన ఔషధం అని నిపుణులు అంటున్నారు. కాఫీ తాగితే శరీరం ఎలా అయితే అలసట నుంచి విముక్తి కలిగినట్లుంటుందో, అశ్వగంధతో కూడా ఇలాంటే భావనే పొందుతారని పేర్కొంటున్నారు. అలసటతో బాధపడే వాళ్లు అశ్వగంధను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందవచ్చని వివరిస్తున్నారు.

జ్ఞాపకశక్తి పెరుగుదల : అశ్వగంధ కేవలం నిరాశ, ఒత్తిడి, ఆందోళన తగ్గించడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని Clevelandclinic పేర్కొంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పనులు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడటంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో అశ్వగంధ మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

వీరు దూరంగా ఉంటే మంచిది! : ఇది ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా ఆహారంలో భాగం చేసుకోవాలని అనుకునే వారు వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదని National Institiute of Health బృందం పేర్కొంది.

NOTE : అశ్వగంధకు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.