ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు పెరగడం వల్ల చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారు. ఇది కేవలం చర్మం బయటే కాకుండా శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. దీని నివారణకు సహజంగా కొన్ని ఆహార పదార్థాలను వాడటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాల తొలగింపు వేగవంతం అవుతుంది. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి, కొవ్వు కరిగించే ప్రక్రియను సక్రమంగా నడిపిస్తుంది.
పచ్చి కూరల్లో క్యాబేజీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండడమే కాకుండా, అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
జీలకర్రను రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి పలు లాభాలు కలుగుతాయి. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి కొవ్వును తక్కువ చేసే విధంగా పని చేస్తుంది. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
గ్రీన్ టీ రోజూ 1 నుంచి 2 సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో జిడ్డును తగ్గించడమే కాకుండా.. ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు తగ్గించడంలో సహకరిస్తుంది.
తక్కువ కొవ్వు కలిగిన మజ్జిగలో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.
































