విమాన ప్రయాణం చేయాలనీ లేదా విమానం ఎక్కాలని కలలు కనే వారికి శుభవార్త. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పరిమిత కాలానికి ‘ఫ్లాష్ సేల్’ ప్రకటించింది.
ఈ బంపర్ ఆఫర్ కింద దేశీయ విమానాల ఛార్జీ కేవలం రూ.1250 నుండి ప్రారంభమవుతాయి. అంటే దేశవ్యాప్తంగా ఒక నగరం నుండి మరొక నగరానికి విమాన ఛార్జీ కేవలం రూ.1250 నుండి మొదలవుతాయి. అలాగే విదేశాలకు వెళ్లడానికి బుకింగ్ చార్జీలు కూడా రూ.6131 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ రెండు రకాల బుకింగ్‌లను 25 మే 2025 వరకు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇండియాలోని మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ లైట్ విమాన ప్రయాణానికి ఛార్జీ రూ.1250 నుండి ప్రారంభమవుతుంది. ఈ కేటగిరీలో బ్యాగ్ చెక్-ఇన్ లేకుండా విమాన టికెట్ అప్షన్ ఉంది. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ధర రూ.1375 నుండి మొదలవుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఇంకా ఇతర ప్రముఖ బుకింగ్ సైట్స్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
అంతర్జాతీయ విమానాల టికెట్స్ కేవలం రూ.6,131 నుండి స్టార్ట్ : ఈ ఫ్లాష్ సేల్ కింద అంతర్జాతీయ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ లైట్ ధర రూ.6131 నుండి ఉంటాయి. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఇంకా ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్‌లకు ఆఫర్ రూ.6288 అలాగే రూ.7,038 నుండి ప్రారంభమవుతుంది. విదేశీ విమానాలకు సంబంధించిన ఈ ఆఫర్లు 2025 ఆగస్టు 6, 12 అండ్ 20 తేదీలోని టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
airindiaexpress.com వెబ్‌సైట్ ద్వారా చేసే ఎక్స్‌ప్రెస్ లైట్ బుకింగ్‌లపై ఎటువంటి సౌలభ్య (convenience ) చార్జెస్ వసూలు చేయడం లేదని కంపెనీ తెలిపింది. ఎక్స్‌ప్రెస్ లైట్ బుకింగ్ కింద ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా 3 కిలోల వరకు బరువున్న అదనపు క్యాబిన్ బ్యాగ్‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశీయ విమానాలలో 15 కిలోల బ్యాగుకు రూ. 1,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ విమానాలలో 20 కిలోల బ్యాగుకు రూ. 1,300 అదనంగా కట్టాల్సి ఉంటుంది.
వీరికి ప్రత్యేక ఆఫర్ : ఇవి కాకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో లాయల్టీ మెంబర్లకు గొప్ప ఆఫర్లు ఇస్తుంది. లాగిన్ అయిన మెంబర్లకు 10 కిలోల అదనపు చెక్-ఇన్ బ్యాగ్ ఇంకా 3 కిలోల అదనపు క్యారీ-ఆన్ బ్యాగ్ పై 25% తగ్గింపు కూడా లభిస్తుంది. కంపెనీ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బంది అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక డిస్కౌంట్స్ అండ్ ప్రయోజనాలను అందిస్తోంది.































