అలాగే రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ ఈ విధంగానే ప్రవర్తిస్తే కాంగ్రెస్ అంటున్న మాటలు నిజమవుతాయని తెలియజేస్తూ వచ్చింది. షర్మిల ఏ విధంగా అన్నకు ఎదుగుతిరిగిందో, తెలంగాణలో కేసీఆర్ కు సొంత బిడ్డ ఎదురు తిరిగింది. ఇదంతా కాంగ్రెస్పార్టీ చేసిన ప్లానేనా? కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతే మరో సారి అధికారంలోకి వస్తుందా? వివరాలు చూద్దాం.. బీఆర్ఎస్ పార్టీలో కవితకు మంచి పేరుంది. ఆమె కంటూ సెపరేట్ కేడర్ కూడా ఏర్పాటు చేసుకుంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప ఇంకెవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడారు. కవిత ఏకంగా పార్టీని నిందిస్తూ కేసీఆర్ పై విల్లు ఎక్కు పెట్టింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం టిపిసిసి చీప్ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది.
లేదంటే సపరేట్ పార్టీ పెట్టిన కానీ పూర్తి డ్యామేజ్ బీఆర్ఎస్ కే జరుగుతుంది. అలా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు కూడా తగ్గి, అధికారంలోకి రాకుండా చేయాలనేదే కాంగ్రెస్ ప్లాన్. దానిలో భాగంగానే కవితను కాంగ్రెస్ ఆహ్వానించడం లేదంటే ఆమె సపరేట్ పార్టీ పెట్టేలా ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ట్రాప్ లో కవిత పడింది అంటే తప్పకుండా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని రాజకీయం మేధావులు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఈ గొడవ చిలికి చిలికి ఏ విధంగా మారుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.
































