షుగర్ కంట్రోల్ కావాలంటే కాకరకాయను ఇలా తినండి..

అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయ కాకరకాయ. దీన్ని తరచూ ఆహారం భాగం చేసుకుంటే అనేక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే యూరిక్ యాసిడ్‌ను, డయబెటిస్‌ను నియంత్రిస్తుంది. అయితే, కాకరకాయను కింది విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.


ఈ రోజుల్లో ఎక్కువమంది ప్రజలు డయాబెటిస్, అధిక యూరిక్ యాసిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులు తీవ్రమైతే ఇతర ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. కాబట్టి, వీటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే, మందులతో పని లేకుండా కేవలం ఒకే ఒక్క కూరగాయతో ఈ రెండు సమస్యలకూ చెక్ పెట్టవచ్చు. అదే కాకరకాయ. ఈ ఒక్కటి ఆహారంలో భాగం చేసుకుంటే యూరిక్ యాసిడ్ కారణంగా వచ్చే గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ స్టోన్స్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో పాటు షుగర్ కూడా అదుపులో ఉంటుంది. మరి, కాకరకాయను ఎలా తింటే ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ తగ్గాలంటే..

కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, బీటా-కెరోటిన్, పొటాషియం వంటి విలువైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కూరగాయకు యూరిక్ యాసిడ్‌, డయాబెటిస్‌లను నియంత్రించే లక్షణాలుంటాయి. ఒక గ్లాసు కాకరకాయ రసం యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించే అద్భుతమైన ఔషధం.

మధుమేహం

కాకరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ప్రయోజనకరం. రుచిలో చేదుగా ఉండే ఆకుపచ్చని కాకరలో విటమిన్ A, C, బీటా-కెరోటిన్, ఇతర ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా నివారిస్తుంది.

కాకరకాయను ఎలా తినాలి?

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో అర కప్పు కాకరకాయ రసం తాగితే చాలా మంచిది. చేదును తొలగించడానికి కొద్దిగా నల్ల ఉప్పు లేదా నిమ్మకాయను జోడించవచ్చు. దీనిని తాగడం వల్ల గౌట్, ఆర్థరైటిస్‌ సమస్యలు మీ దరిచేరవు. కావాలంటే రసంతో పాటు, వివిధ రకాల కూరగాయలను కాకరతో కలిపి వండుకుని తినవచ్చు. ఇంకా కాకరపొడిని నీళ్లలో వేసుకుని కూడా తాగవచ్చు. కాకర పొడిని తయారుచేసేందుకు ముందుగా కాకరకాయను బాగా కడగాలి. తరువాత వాటిని కోసి నీడలో ఆరబెట్టి మెత్తటి పొడి చేసుకోండి. ఈ పొడిని ప్రతి ఉదయం సగం లేదా ఒక టీస్పూన్ నీళ్లలో వేసుకుని తాగండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.