తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పనున్నది. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు, రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్లు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఒక డీఏ, ఆరోగ్య పథకం ప్రకటనకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆర్థికేతర డిమాండ్లపై అధికారిక ప్రకటన రానుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అలాగే, మారం జగదీశ్వర్ నేతృత్వంలోని జేఏసీలో లచ్చిరెడ్డి సారథ్యంలోని జేఏసీ విలీనానికి చర్చలు పూర్తయ్యాయి. వారం రోజుల్లో ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఈ విలీనంపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
































