‘డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు’: రాబర్ట్ కియోసాకి

తిపెద్ద మార్కెట్ క్రాష్ జరగబోతోంది, ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, బంగారం రూ.21 లక్షలకు చేరుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ‘రాబర్ట్ కియోసా’కి తాజాగా చాలా మంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు.


దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

రాబర్ట్ కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను ”గ్రేషమ్స్ లా, మెట్‌కాల్ఫ్ లా” గురించి వివరిస్తూ.. ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు. ‘డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు’ అని పేర్కొన్నారు.

గ్రేషమ్స్ లా ప్రకారం.. ‘చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు.. మంచి డబ్బు దాగిపోతుంది’. ఎలా అంటే యూఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోయే అవకాశం ఉంది. నిజమైన డబ్బును ఆదా చేయాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.

మెట్‌కాల్ఫ్ లా అనేది.. నెట్‌వర్క్స్. దీనికి ఉదాహరణగా ”మెక్‌డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ నెట్‌వర్క్. మామ్ పాప్ బర్గర్స్ అనేది కాదు. ఫెడెక్స్ ఒక నెట్‌వర్క్. జో వన్-ట్రక్ డెలివరీ అనేది కాదు” అని కియోసాకి వివరిస్తూ.. నేను బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అది ఒక నెట్‌వర్క్.. అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు. మీరు ధనవంతులు కావాలనుకుంటే.. చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పారు.

”వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి, ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు” అనే మైఖేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. నేను యూఎస్ డాలర్లను ఆదా చేయను, ఎందుకంటే పొదుపు అనేది గ్రేషమ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే నేను నెట్‌వర్క్‌లు లేని చెత్త నాణేలలో పెట్టుబడి పెట్టను, ఎందుకంటే అవి మెట్‌కాల్ఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. అందుకే నేను బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల మీదనే పెట్టుబడి పెడతాను. అయితే ఈ చట్టాలని పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.