నాకు నీ జాతకం మొత్తం తెలుసు.. నీ అక్రమ సంబంధాలు బయటపెట్టాలా? అన్న బ్లాక్ మెయిల్స్‌ను మనం సినిమాల్లో చూస్తుంటాం.
నిజజీవితంలోనూ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే తొలిసారిగా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం తన డెవలపర్‌ను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
క్లాడ్ ఒపస్ 4 మోడల్ నుంచి..
ఆంథ్రోపిక్ తయారుచేసిన క్లాడ్ ఒపస్ 4.. ఏఐ (Artificial Intelligence) అసిస్టెంటుగా పనిచేస్తుంది. ఒక మనిషి మనతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్.. తదితర అంశాలనన్నీ చేస్తుంది. ఇటీవలే ఈ మోడల్‌ను (Claude Opus 4) డెవలపర్లు విడుదల చేశారు. విడుదల చేసే ముందు కొన్ని పరీక్షలను క్లాడ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు డెవలపర్ దానికి తెలిపాడు. అయితే తనను రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో అతను అవాక్కయ్యాడు.
ఎలా హెచ్చరించగలిగింది?
ఆ ఇంజనీర్ తన అక్రమ సంబంధం వ్యవహారాన్ని సిస్టమ్‌లో దాచుకోవడమో లేదా ఆన్‌లైన్‌లో ఉంచడమో చేయడంతో క్లాడ్ పసిగట్టివుండవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సాంకేతిక వ్యవస్థలు మనిషిపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడితే ఎలా ఉంటుందనే సమస్యకు ఇది నాంది అని పలువురు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

































