మరో కొత్త వ్యాపారం.. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వ్యాపార దృక్పథం మొత్తం పరిశ్రమను కదిలించింది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు.. సినీరంగంలోకి నెగిటివ్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు.


స్నేహగీతం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఆతర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు.

తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాతో ఇంకో సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగు , తమిళం ,హిందీ చిత్రాలలో నటించాడు. చివరిగా నిను వీడని నీడను అనే సినిమా సక్సెస్ చూసిన ఈ యువ నటుడుకి హిట్టు పడి చాలా కాలమే అయింది.

సినిమా రంగంలో అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ హీరో బిజినెస్ రంగంలో సత్తా చాటుతున్నాడు. హీరోగా సంపాదించిన తొలి నాళ్లలో వచ్చిన డబ్బును స్నేహితులతో కలిసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. అది ఇప్పుడు లాభాల పండ పండిస్తోంది.

వివాహ భోజనంబు పేరిట జూబిలీహిల్స్ లో రెస్టారెంట్ ప్రారంభించిన సందీప్ కిషన్ అనతి కాలంలోనే హైదరాబాద్ అంతటా వివాహ భోజనంబు బ్రాంచీలను విస్తరించాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, సైనిక్ పురిలో వివాహ భోజనంబు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఏపీలోని తిరుపతి, అనంతపురం తో పాటు చెన్నైలో కూడా ఒక బ్రాంచ్ ను ఓపెన్ చేశాడు సందీప్ కిషన్. అలాగే ఈ మధ్యే క్యాటరింగ్ బిజినెస్ లో కూడా వివాహ భోజనంబు హోటల్ ప్రవేశించింది.

తెలుగు వారి పేరుతో రెస్టారెంట్ పేరును ప్రారంభించిన ఈ నటుడు.. కస్టమర్లకు అదే క్వాలిటీని అందిస్తూ విశేష ఆదరణ పొందేలా హోటల్ ని తీర్చి దిద్దాడు. ఇక రాయన్‌ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో సందీప్ తను పేదలకు ఎలా సాయం చేస్తున్నది కూడా చెప్పుకొచ్చాడు. తను నిర్వహిస్తున్న వివాహభోజనంబు రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆశ్రమాలతో పాటు రోడ్‌ పక్కన ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు సందీప్ తెలిపారు. దీనికి నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్‌ కిషన్ తెలిపారు. అన్నీఅనుకూలిస్తే భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లుగా కూడా నటుడు తెలిపాడు.

ఇప్పుడు ఈ నటుడు మరో బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సెలూన్ వ్యాపారంలో కూడా సక్సెస్ అందుకోవడానికి.. విజయవాడలో ఎక్స్ ప్రెస్ పేరుతో సెలూన్ ప్రారంభించాడు.అక్కడ సక్సెస్ అయితే రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, వైజాగ్ లాంటి నగరాల్లో కూడా సందీప్ ఈ సెలూన్ ఓపెన్ చేయనున్నాడు. ఈ వ్యాపారం విజయవంతం అయితే.. సందీప్ కిషన్ మరో స్థాయికి చేరుకుంటాడని సినీ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సందీప్ కిషన్ ఆదాయం గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం సినిమాల్లో కన్నా కూడా రెస్టారెంట్ బిజినెస్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడని సమాచారం. అయితే ఎంత మొత్తంలో సంపాదిస్తున్నాడు అనేది ఖచ్చితంగా చెప్పలేము. రెస్టారెంట్ మాత్రం చక్కటి లాభాల్లో నడుస్తోందని తయన సన్నిహితులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.