పెరుగుతున్న వయస్సు, ఒత్తిడి, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల కారణంగా జుట్టు తెల్లబదుతుంది. ఇది నేడు ఒక సాధారణ సమస్యగా మారింది. అటువంటి పరిస్థితిలో చాలా మంది మార్కెట్లో లభించే హెయిర్ డై లేదా కలర్ సహాయం తీసుకుంటారు.
అయితే ఈ హెయిర్ డైలలో ఉండే అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు దీర్ఘకాలంలో జుట్టును దెబ్బతీస్తాయని మీకు తెలుసా? ఇవి జుట్టు మూలాలను బలహీనపరచడమే కాదు జుట్టును పొడిగా, నిర్జీవంగా చేసి, జుట్టు రాలడానికి కారణమవుతాయి.
ఎవరైనా జుట్టును సహజంగా నల్లగా చేసుకోవాలనుకుంటే.. దీనికి చాలా సులభమైన , ప్రభావవంతమైన వంటింటి చిట్కా కాఫీ పౌడర్. అవును మీరు ప్రతి ఉదయం ఇష్టంగా తాగే కాఫీ మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. కాఫీకి సహజమైన లక్షణం రంగు వేయడం. కాఫీ పొడి జుట్టుకు ఎటువంటి నష్టం కలుగకుండా ముదురు రంగును ఇస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది. కనుక ఈ రోజు కాఫీతో జుట్టును నల్లగా మార్చుకోవడానికి సులభమైన , సురక్షితమైన మార్గాన్ని తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు
ఇన్స్టంట్ కాఫీ పౌడర్ (లేదా ఏదైనా డార్క్ కాఫీ)- 2 టేబుల్ స్పూన్లు
నీరు- 1 కప్పు
కండిషనర్ 1 టేబుల్ స్పూన్(మీకు ఇష్టమైన )
హెయిర్ ఆయిల్ (కొబ్బరి లేదా బాదం నూనె)- 1 టేబుల్ స్పూన్
పేస్ట్ ఎలా తయారు చేయాలి
నీటిని వేడి చేసి..ఆ వేడి నీటిలో కాఫీ పొడి కలపండి. బాగా కలిపి చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కండిషనర్, కొద్దిగా హెయిర్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన, పొడి జుట్టుకి మూలాల నుంచి .. జుట్టు చివరల వరకు బాగా అప్లై చేయండి. జుట్టును షవర్ క్యాప్ తో కప్పి.. దాదాపు 1 గంట పాటు అలాగే ఉంచండి. ఒక గంట తర్వాత జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. షాంపూ చేయవద్దు. మొదటిసారి ఉపయోగించేటప్పుడు స్వల్ప తేడా కనిపిస్తుంది. మెరుగైన ఫలితాల కోసం ఈ కాఫీ పొడి చిట్కాను వారానికి 2-3 సార్లు అప్లై చేయవచ్చు.
కాఫీ హెయిర్ డై వల్ల కలిగే ప్రయోజనాలు
కాఫీ హెయిర్ డై వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా ఇది సహజమైనది . ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది జుట్టుకు ముదురు రంగును ఇస్తుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది మాత్రమే కాదు జుట్టుకు మంచి పోషణనిచ్చిబలంగా చేస్తుంది. తద్వరా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































