మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్‌లు ఉంటే మీకు డబ్బు మరియు సమయం రెండూ ఆదా అవుతాయి.

ఈ నాలుగు ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో ఖచ్చితంగా ఉంటే చాలు.. దీని వల్ల మన టైము డబ్బు రెండు ఆదా అవుతాయి. అలాంటి నాలుగు యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎం పరివాహన్ యాప్ (m parivahan app): ఈ యాప్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్, RC, పొల్యూషన్ ఇన్సూరెన్స్, ప్రతిదీ స్టోర్ చేసుకోవచ్చు . ఫ్యూచర్ లో ఎవరైనా పోలీసులు ఆపితే ఈ యాప్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ చూపిస్తే చాలు. ఫిజికల్ కాపీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫైన్ నుండి తప్పించుకోవచ్చు.

DigiLocker (డిజి లాకర్‌): ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మన సమాచారం అంతా ఇస్తే ఆటోమేటిక్ గా ఇదే యాప్ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ అదేవిధంగా ఇంకమ్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ ఇలా ఏ టు జెడ్ ఆఖరికి బిటెక్ మార్క్ లిస్ట్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఈ యాప్ లో చూపిస్తుంది. సో మీరు ఫిజికల్ కాపీస్ క్యారీ చేయాల్సిన భారం ఉండదు.

Digi Yatra (డిజి యాత్ర): ఈ మధ్య ఎయిర్ పోర్టుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఎయిర్పోర్ట్స్ లో కూడా పెద్ద పెద్ద లైన్స్ క్యూస్ ఉంటూన్నాయి. మన ఫోన్ లో కనుక డిజి యాత్ర యాప్ ఉంటే చాలు, బోర్డింగ్ పాస్ ని అప్లోడ్ చేస్తే అది మన ఫేస్ ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉంటే పెద్ద పెద్ద లైన్లలో నుంచోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఎయిర్ పోర్టులోని డిజి యాత్ర లైన్ ఉంటుంది. ఇక్కడ పెద్దగా జనం ఉండరు. అక్కడికి వెళ్లి మన ఫోన్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్ గా మన ఫేస్ ని కూడా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. చాలా టైం మనకైతే ఆదా అవుతుంది.

RBI Retail Direct, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ యాప్ : ఈ యాప్ లో ప్రభుత్వానికి సంబంధించిన బాండ్స్ లోని సెక్యూరిటీస్ లోని అదేవిధంగా ట్రెజరీ బిల్స్ లోని డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్రోకర్ ఉండడు. డబ్బు కూడ ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ యాప్ కంప్లీట్ గా ఫ్రీ ప్రభుత్వ యాప్. కనుక 100% సేఫ్…. మనకి బ్యాంకు ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.