గోల్డ్ లోన్ కి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. రీసెంట్ గా ఆర్బిఐ కొత్త రూల్స్ ప్రతిపాదించింది. అతి త్వరలో ఈ రూల్స్ అనేవి అమలు లోనికి వచ్చే కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ రూల్స్ వలన మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రస్తుతం మారిన రూల్స్ ప్రకారం గోల్డ్ లోన్స్ పై ఇచ్చే రుణం తగ్గిపోయింది. దీన్నే LTV తగ్గించడం అంటారు. అంటే లోన్ టు వాల్యూ రేషియో అని అర్థం.
ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష విలువైన బంగారాన్ని బ్యాంక్ కి వెళ్లి తాకట్టు పెట్టారు అనుకుందాం. గోల్డ్ లోన్ కోసం తాకట్టు అంటే ప్లెడ్జ్ చేశారు అని అర్థం. అప్పుడు మీకు బ్యాంకు లక్ష రూపాయల లోన్ శాంక్షన్ చేయదు. మార్కెట్ వాల్యూ పరంగా లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే, బ్యాంకు మీకు రూ. 75000 లోన్ ని శాంక్షన్ చేస్తుంది. ఇక్కడ LTV ఎల్టివీ రేషియో చూసుకున్నట్లయితే 75% అని అర్థం.
ఆర్బీఐ సూచన చేసిన కొత్త రూల్ ప్రకారం, ఇక్కడి నుండి ఏ బ్యాంక్ అయినా NBFC అయినా సరే ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినా సరే ఎల్టీవీ ని 75% కంటే తక్కువే ఆఫర్ చేయాలి. ఇక్కడి నుండి 75% కంటే ఎక్కువ ఎల్టీవీని ఆఫర్ చేయడానికి లేదు. ఇది కొత్త రూల్ ఎందుకంటే కొన్ని NBFCలు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఈ ఎల్టీవీని 80% నుంచి 90% వరకు ఆఫర్ చేస్తున్నారు.
ఆర్బిఐ కోవిడ్ టైం లో అంటే ఆగస్టు 2020 లో అన్ని బ్యాంక్స్ కి ఈ రూల్ ని జారీ చేసింది. ఎల్టీవీ ని 90% కి పెంచమని చెప్పింది. ఎందుకంటే కోవిడ్ టైం లో చాలా మందికి డబ్బుల అవసరం ఏర్పడింది. బంగారాన్ని తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకునేవారికి ఎల్టీవీ 90% కి పెంచమని చెప్పింది. అయితే కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఎల్టీవీ రేషియో ని 90% కి పెంచాయి.
అప్పటి నుంచి వాళ్ళు కూడా 90% ఆఫ్ వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఆర్బిఐ తాజాగా అన్ని బ్యాంకులకి ఆదేశాలు జారీ చేసింది. ఎల్టివీ రేషియోని 90% నుండి 75% కి తగ్గించమని చెప్పింది. దీంతో ఇప్పుడు మీకు ఒక లక్ష విలువైన బంగారంపై 75 శాతం మాత్రమే లోన్ లభిస్తుంది.
































