బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులను వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా వివిధ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రివార్డులతో క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు వివిధ కార్డులను కస్టమర్లకు జారీ చేస్తుంది. అయితే ఈ కార్డులపై వచ్చే రివార్డుల నిబంధనలను ఇటీవల సవరించింది.ఈ నేపథ్యంలో సవరించిన రివార్డు నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు, నిబంధనలు, షరతులకు సవరణలను ఇటీవల ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 20, 2025 నుంచి అక్టోబర్ 2025 మధ్య అమలులోకి వస్తాయి. ఈ మార్పులు క్రెడిట్ కార్డు హోల్డర్లకు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. కొన్ని కార్డులు డౌన్గ్రేడ్లను ఎదుర్కొంటుండగా మరికొన్ని మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా అధికంగా వాడే మాగ్నస్ ఫర్ బర్గండి, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ క్రెడిట్ కార్డులు గణనీయమైన డౌన్గ్రేడ్లను బ్యాంకు ప్రకటించింది. అయితే సెలెక్ట్, ప్రివిలేజ్ వంటి కార్డులు దాని కస్టమర్లకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నారు.
మాగ్నస్ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్
జూన్ 20 నుంచి అమలులోకి వచ్చే విధంగా మాగ్నస్/మాగ్నస్ ఫర్ బర్గండి క్రెడిట్ కార్డ్ రివార్డులను అప్ డేట్ చేశారు. ఇకపై కార్డ్ హోల్డర్లు నెలకు రూ. 1.5 లక్షల వరకు ఖర్చు చేసే ప్రతి రూ. 200 కు 12 ఎడ్జ్ రివార్డు పాయింట్లను అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని దాటి క్రెడిట్ పరిమితిని చేరుకునే వరకు రేటు రూ. 1.5 లక్షలతో కలిపి రూ. 200కు 35 పాయింట్లకు పెరుగుతుంది. ఆ తర్వాత అది రూ. 200 కు 12 పాయింట్లకు తిరిగి వస్తుంది. ఇకపై కస్టమర్లు ఇప్పుడు వారి వ్యక్తిగత క్రెడిట్ పరిమితి వరకు మాత్రమే వేగవంతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ పరిమితిని దాటి రివార్డులు బేస్ రేటు వరకు మాత్రమే వర్తిస్తాయి. వ్యక్తిగతం కాని లేదా వాణిజ్య ఉపయోగం కోసం నెలవారీ క్రెడిట్ పరిమితులను ముగించే కస్టమర్లు ఈ సదుపాయాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం ఈ మార్పులు చేశామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు వేగవంతమైన ఆదాయాలపై పరిమితిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు మింత్రా షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ 1 శాతం నుండి 7.5 శాతానికి పెరిగింది కానీ ఇప్పుడు త్రైమాసికానికి రూ. 4,000కి పరిమితం చేశారు. ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్‌లలో 5 శాతం క్యాష్‌బ్యాక్ అలాగే ఉంది. కానీ ప్రతిదానికీ త్రైమాసికానికి రూ. 4,000కు మాత్రమే పరిమితం చేశారు.
ఉచిత లాంజ్ యాక్సెస్ నిలిపివేత
ఉచిత దేశీయ లాంజ్ యాక్సెస్ ప్రయోజనాన్ని బ్యాంక్ నిలిపివేస్తుంది. ఇది తరచుగా ప్రయాణించే వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కార్డు మొత్తం విలువను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
































