నిన్ననే రుతుపవనాలు ఏపీకి తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు చెదురు మదురుగా భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీలోకి ( Andhra Pradesh) రుతుపవనాల ఎంట్రీ తో అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. నిన్ననే రుతుపవనాలు ఏపీకి తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు చెదురు మదురుగా భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, చెట్ల వద్ద నిలబడ వద్దని సూచించింది. ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రంలో ఏకకాలంలో అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఇప్పుడు ఉంది. అయితే జూన్ రెండు వరకు రుతుపవనాలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
* మత్స్యకారులకు సూచన
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు( rain) పడే అవకాశం ఉంది. సముద్రం సైతం అల్లకల్లోలంగా ఉంది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది వాతావరణ శాఖ. ఈరోజు ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే రైతులతో పాటు మత్స్యకారుల సైతం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
* కేరళ ను తాకిన రెండు రోజుల్లోనే..
మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. కేరళను తాకిన రెండు రోజుల్లోనే రుతుపవనాలు ఏపీకి విస్తరించడం శుభ పరిణామం. అనంతపురం జిల్లా మీదుగా రుతుపవనాలు ప్రవేశించాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పూర్తిగా.. ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో సగటు వార్షిక వర్షపాతం లో 70 శాతం జూన్- సెప్టెంబర్ మద్యకాలంలో కురుస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది సాధారణం కంటే 21% ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది వర్షపాతం నమోదులో వ్యత్యాసం కనిపించింది. కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా కొనసాగింది. కర్ణాటకలో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది.
* చాలా వేగంగా రుతుపవనాలు..
16 సంవత్సరాల తరువాత తొలిసారిగా అతివేగంగా రుతుపవనాలు దేశానికి తాకాయి. గత ఏడాది బంగాళాఖాతంలో( Bay of Bengal) ఏర్పడిన రెమాల్ తుఫాన్ వల్ల ఎనిమిది రోజులు ముందుగానే కేరళకు రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఏపీకి రుతుపవనాలు జూన్ 5న ప్రవేశిస్తాయి. కానీ ఈసారి తొమ్మిది రోజులు ముందే తాకడం విశేషం. ప్రస్తుతం మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతత విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర దగ్గర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణీ ఉంది. సోమవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. విజయనగరం జిల్లాలోని మెరకముడిదంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
































