వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లా మార్చింది. అయితే ప్రజల నుంచి కూడా పలు వినతులు రావడంతో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
































