రూ.500 నోట్లను రద్దు చేయాలి.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.


దేశంలో అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన ప్రకటించారు. మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు, “దేశంలో పెద్ద నోట్లైన రూ.500, రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయాలి. ఈ నోట్ల రద్దుతో అవినీతి, నల్లధనం వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. పెద్ద నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను,” అని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, డిజిటల్ కరెన్సీ వినియోగం ద్వారా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరుగుతాయని, అక్రమాలు చేసే వారిని సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. “డిజిటల్ కరెన్సీ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అవినీతి నిరోధక చర్యల్లో ఇది కీలకమైన అడుగు అవుతుందన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.