మీరు పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. అంతా సర్దుకుంటుంది.

నం ఎక్కువసేపు కూర్చుంటే కడుపు సరిగ్గా పని చేయదు. దాని వల్ల మలద్వారం దగ్గర రక్తం తిరగడం తగ్గి పైల్స్, చర్మ సమస్యలు మొదలవుతయ్. ఇంకా కారం ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.


అలాంటి తిండి వల్ల కడుపులో వేడి పెరిగి ఈ సమస్య ఇంకా ఎక్కువైతుంది.

పైల్స్ సమస్యకు ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి పాలలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పాలు ఎక్కువగా కాకుండా తగిన మోతాదులో మాత్రమే నిమ్మరసంతో కలిపి తాగాలి. ఈ పద్ధతి పైల్స్ వల్ల కలిగే మంట, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి పండును ఎక్కువగా తినడం పైల్స్ సమస్యకు మంచిది. బొప్పాయిలో పైపిన్, యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పైల్స్, మూలవ్యాధి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.

ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, గింజలు, పండ్లు ఎక్కువగా తినడం వల్ల కడుపు మంచిగా పని చేస్తుంది. పీచు వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

మీరు స్వీట్ కార్న్‌ ను చాట్‌ గా లేదా ఇతర రూపాల్లో తినవచ్చు. ఇది కడుపుకు మంచిది. రుచికరంగా కూడా ఉంటుంది. ఇది పైల్స్ కి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పైల్స్ ఉన్నవారు చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఎక్కువ నూనె, మసాలాలు కూడా వాడటం తగ్గించాలి. ఈ అలవాట్లను రెండు నుంచి మూడు నెలల పాటు పాటిస్తే సమస్య తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న ఇంటి చిట్కాలు, సరైన ఆహారం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆపరేషన్ లేకుండానే సులభంగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.