అమెరికా నుంచి వచ్చే భారతీయ విద్యార్థులకు మరో షాక్? అలా చేస్తే వీసా రద్దు.

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులతో పాటు విదేశీ విద్యార్దులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే చిన్నా చితకా కారణాలతో విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసి వారి స్వదేశాలకు పంపేస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వారికి మరో షాకిచ్చింది. ఇకపై ఇలా చేస్తే కూడా మీ వీసా రద్దవుతుందంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది.


అమెరికాలో వీసా తీసుకుని చదువుకుంటుున్న విదేశీ విద్యార్ధులు క్లాసులు ఎగ్గొట్టడం, డ్రాప్ అవుట్లు కావడం, తాము చదువుతున్న కాలేజీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోర్సు వదిలేసి వెళ్లిపోవడం వంటి చర్యలకు పాల్పడితే వీసా రద్దు చేస్తామని ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులోనూ వీరికి మరే ఇతర వీసాలూ లభించవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో భారత్ లో అమెరికా ఎంబసీ ఓ పోస్టు చేసింది. ఇందులో స్పష్టమైన హెచ్చరికలు చేసింది.

ఇప్పటికే అమెరికాలో చదువుతున్న 4700 మంది విదేశీ విద్యార్దులను చిన్నా చితకా కారణాలతో ట్రంప్ సర్కార్ దేశం నుంచి బహిష్కరించింది. వీరికి జారీ చేసిన వీసాలు రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్ధులను భారీగా నియంత్రిస్తున్న ట్రంప్ సర్కార్ .. ఇప్పటికే అక్కడ ఉన్న వారిని సైతం ఎలా పంపించేయాలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆంక్షలు విధించడం, వాటిని పక్కాగా అమలు చేయడం, ఉల్లంఘిస్తే వీసా రద్దు చేసి దేశ బహిష్కరణ చేసేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.