ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్యాక్‌ను తీసుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఆల్-ఇన్- వన్ ఓటీటీలతో కూడిన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, జీ5, సోనీలివ్ వంటి 25కు పైగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఈ ప్లాన్లతో యాక్సెస్ చేయొచ్చు. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధర రూ.279గా నిర్ణయించింది. ఓటీటీ ప్లాన్స్‌తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కావాలనుకొనే వారి కోసం ఇందులో రెండు ప్లాన్లు ఉన్నాయి.
ప్లాన్ల వివరాలు ఇవే..
- రూ.279 ప్లాన్: నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్సస్ట్రీమ్ ప్లే ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లు యాక్సెస్ పొందొచ్చు. ఒక నెల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. దీని రీఛార్జితో యూజర్లు రూ.750 విలువైన ప్యాక్ ప్రయోజనాలు పొందుతారని ఎయిర్టెల్ చెబుతోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా సభ్యత్వం పొందొచ్చు.
- రూ.598 ప్లాన్: నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సభ్యత్వంతో పాటు అన్లిమిటెడ్ 5జీ, అన్లిమిటెడ్ కాల్స్‌ను కూడా అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు
- రూ.1,729 ప్లాన్: నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సభ్యత్వంతో పాటు అన్లిమిటెడ్ 5జీ, అన్లిమిటెడ్ కాల్స్‌ను కూడా అందిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ తీసుకొచ్చారు.
- టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ మధ్య చాలా కాలంగా గట్టి పోటీ ఉంది. యూజర్లను ఆకట్టుకొనేందుకు ఇరు సంస్థలు తెగ పోటీ పడుతుంటాయి. గత వారంలోనే గూగుల్‌తో జట్టుకట్టి ఎయిర్టెల్ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ సేవల్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఆన్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లతో మరింత మంది యూజర్లను రాబట్టుకోవాలని చూస్తోంది. ట్రాయ్ డేటా ప్రకారం.. మార్చిలో ఎయిర్టెల్ 1.65 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను పెంచుకుంది. దీంతో వినియోగదారుల సంఖ్య 386.96 మిలియన్లకు చేరుకుంది. మార్కెట్లో 33.61 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
































