మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తుడరం'(Thudarum Movie) ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
ఈ ఏడాది ప్రారంభం లో మోహన్ లాల్ ‘L2 :ఎంపురాన్’ చిత్రం తో మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ హైప్ భారీగా ఉండడం వల్ల కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా వసూళ్లను ఇప్పట్లో మోహన్ లాల్ కొట్టలేడేమో అని అంతా అనుకున్నారు. కానీ సరిగా నెల తిరిగే సమయానికి ‘తుడరం’ చిత్రం తో ‘ఎంపురాన్’ ని మించిన భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.
అందులో కేవలం కేరళ నుండే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. కేరళ నుండి వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి చిత్రమిదే. ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మూడవ వారం లోనే విడుదల చేయాలి. కానీ కలెక్షన్స్ భారీ గా వస్తుండడంతో కొద్దిరోజులు ముందుకు జరిపారు. కాసేపటి క్రితమే ఈ చిత్రాన్ని మే 30వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది ఆ ఓటీటీ సంస్థ. మలయాళం తో పాటు తెలుగు లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే టాక్సీ డ్రైవర్ షణ్ముఖం (మోహన్ లాల్) ని అందరు బెంజ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇతనికి లలిత (శోభన) భార్య ఉంటుంది. ఈ దంపతులిద్దరూ తమ కొడుకు, కూతురుతో సంతోశావంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. షణ్ముఖం కి తన పాత అంబాసిడర్ కారు అంటే ప్రాణం. ఒకరోజు అతని కొడుకు తన స్నేహితులతో కలిసి షణ్ముఖం కి చెప్పకుండా కారుని తీసుకొని షికారుకి వెళ్తాడు. షణ్ముఖం దీనిని గమనించి వీళ్ళను పట్టుకునేలోపు కారు డ్యామేజ్ కి గురి అవుతుంది. ఆ తర్వాత ఆయన ఆ కారుని మెకానిక్ షెడ్ లో ఇచ్చి కొడుకు మీద చెయ్యి చేసుకుంటాడు. దీంతో కోపం తెచ్చుకున్న కొడుకు రెండు మూడు రోజులు కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎంత వెతికినా దొరకడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసేందుకు అమితాసక్తిగా అనిపిస్తాయి. ఈమధ్య కాలం లో ఇలాంటి థ్రిల్లర్ ని మీరెప్పుడు చూసి ఉండరు. ఈ వీకెండ్ కి తప్పక మిస్ కాకుండా చూడండి
































