డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం..

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఉన్నతి పథకం కూడా అందుబాటులోకి తెచ్చింది. మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించి వాళ్లకు సాధికారత సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద జీరో వడ్డీకి రుణాలను అందిస్తున్నారు. ఉన్నతి పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పల్లి జిల్లాలలో దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అధికారులు అర్హులైన ఎస్సీ మరియు ఎస్సీ మహిళలు జీరో వడ్డీ రుణం కింద ఉన్నతి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థికంగా సాయం అందించే వాళ్లను ఆర్థిక సాధికారత సాధించడం కోసం ఇప్పటివరకు అనేక చర్యలను తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించి వారిని ఆర్థికంగా బలంగా చేసే విధంగా పలు పథకాలను రూపొందించింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘం లో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం అమలు చేస్తుంది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద ప్రభుత్వం జీరో వడ్డీకి రుణం అందిస్తుంది. ఉన్నతి పథకం కింద అర్హులైన ఎస్సీ మరియు ఎస్టీ మహిళలు జీరో వడ్డీకి రుణాలు పొంది చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థికంగా స్థిరపడాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ఉన్నది పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలయ్యింది.

2014 లో ఏర్పాటు అయినా టిడిపి ప్రభుత్వం కూడా ఉన్నతి పథకాన్ని కొనసాగించింది. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా రాణిస్తున్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు అప్పట్లో ఉన్నతి పథకం కింద ఒక్కో మహిళకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు సున్న వడ్డీకి ప్రభుత్వం రుణాలు అందించేది. 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద దీన్ని రూ.5 లక్షల వరకు పెంచింది. ఈ క్రమంలో డ్వాక్రా సంఘాలలో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలు జీరో వడ్డీకి రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.