తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి ఎన్నికయ్యారు. కడప మహానాడు(Kadapa Mahanadu)లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతేకాదు పార్టీ తరపున ప్రకటించారు. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ((TeluguDesam Party)) అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రతి రెండేళ్లకోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతూ కొనసాగారు. తాజాగా కూడా చంద్రబాబు నాయుడిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్నుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా 30 ఏళ్లగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పార్టీ విజయం కోసం ఆయన చాలా కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. 2004, 2009తో పార్టీ ఓడిపోయింది. విభజిత రాష్ట్రంలో జరిగిన తొలిసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆతర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. 2024లో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించారు. మరోసారి కూడా జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

































