జియో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120 కి.మీ ప్రయాణం.

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. తన ఎలక్ట్రిక్ స్కూటర్ 2025ను అధికారికంగా లాంచ్ చేసింది.


ఇది భారత్ లో రోజువారీ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తయారు చేశారు. ఇది పెట్రోల్ స్కూటర్ కంటే ఐదు రెట్లు చౌకైనదని, వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని EV దిగ్గజం జియో తెలిపింది.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫీచర్లను రూపొందించారు. ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ కోసం హోం ప్లగ్, బ్యాటరీ ఛేంజ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. 4G LTE, యాప్ ఇంటిగ్రేషన్, జియో ఫెన్సింగ్ ఉంటుంది. తమ బడ్జెట్ లో స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే రైడర్లకు ఇది మంచి ఎంపిక.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ పట్టణాల్లో ఉండే రైడర్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు . బ్యాగులు, ఇతర ఏదైనా సామాగ్రి పెట్టుకునేందుకు వీలుగా ఫ్లాట్ ఫుట్ బోర్డు ఉంటుంది. రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపోయే విశాలమైన కుషన్ సీటు ఉంటుంది. ఇండియాలో రోడ్లకు అనువుగా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే. .3.2kwhలిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 80నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. డస్ట్, వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందింది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ స్కూటర్ రైడింగ్ కు అనువుగా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4kwహబ్ మోటార్ ఉంటుంది. ఇది 110Nmటార్క్ ను అందిస్తుంది. ఈ స్కూటర్ లో ఎకోమోడ్, సిటీమోడ్, స్పెర్ట్స్ మోడ్ మూడు రైడ్ మోడ్ లు ఉంటాయి. ఇవి బ్యాటరీ లైఫ్, సిటీలో ప్రయాణం , హైవే పై ప్రయాణాల్లో సమతుల్యతను పెంచుతాయి.

ఈ స్కూటర్ లో ఛార్జింగ్ కోసం హైబ్రిడ్ ఛార్జింగ్ మోడల్ ను ప్రవేశపెట్టారు. ఛార్జింగ్ సౌలభ్యంకోసం ఇంటి దగ్గర హోం ప్లగ్, ప్రయాణంలో ఉన్నప్పుడు జియో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ ఫీచర్లు:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 4G LTE కనెక్టివిటీతో వస్తుంది. దీనిద్వారా రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, మెయింటెనెన్స్ అలెర్ట్, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ , జియో ఫెన్సింగ్, చోరీకి గురికాకుండా నోటిఫికేషన్లు వంటి అద్బుతమైన ఫీచర్లున్నాయి. ఈ స్కూటర్ జియో మార్ట్‌తో అనుసంధానించబడి ఉంది. దీని వలన కస్టమర్లు స్కూటర్ యాప్ నుంచి నేరుగా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు.

ధర, లభ్యత..

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ఖర్చులతో నడుపవచ్చు.
ఖర్చు కారకం పెట్రోల్ స్కూటర్ జియో ఎలక్ట్రిక్ స్కూటర్
కొనుగోలు ధర రూ.70వేలు-90వేలు రూ.70వే-80వేలు (అంచనా)
నెలవారీ ఇంధనం/ఛార్జ్ రూ.2వేలు-3వేలు రూ.300-400
వార్షిక నిర్వహణ రూ.3వేలు-5వేలు రూ.1,000-1,500
భీమా అధికం తక్కువ (EV డిస్కౌంట్లు వర్తిస్తాయి)
రోడ్డు పన్ను ప్రామాణికం తగ్గించబడిన/మాఫీ చేయబడిన (రాష్ట్ర EV చట్టాలు)
జీవితకాల ఖర్చు అధిక గణనీయంగా తక్కువ

ఇంకా ప్రభుత్వంనుంచి సబ్సిడీలు, EV ప్రోత్సాహకాల వల్ల ముందస్తు ఖర్చులు మరింత తగ్గే అవకాశం ఉంది.

హోమ్ ఛార్జింగ్ : ప్రామాణిక 5A అవుట్‌లెట్లు ఉంటాయి. 3-5 గంటల పూర్తి ఛార్జ్అవుతుంది.
బ్యాటరీ మార్పిడి : జియో ప్రత్యేక స్వాప్ స్టేషన్లలో మార్చుకోవచ్చు.
పబ్లిక్ ఛార్జింగ్:ఇప్పటికే ఉన్న పట్టణ EV నెట్‌వర్క్‌లలో ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ప్లేస్‌మెంట్:అండర్-ఫుట్‌బోర్డ్ డిజైన్ బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది. స్టోరేజ్ ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.