10వ తరగతి మూల్యాంకనంలో తప్పులు.. విద్యాశాఖ కీలక ప్రకటన

ఏపీ 10th పరీక్షల సమాధాన పత్రాల వాల్యుయేషన్లో(10th Paper Valuation) తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అసహనం వ్యక్తం చేశారు.


బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 10th రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నట్టు SSC బోర్డ్ డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

జూన్ 1న నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కాగా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కారణంగా IIITలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి జూన్ 2, 3 తేదీల్లో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. పేపర్ వాల్యుయేషన్స్ లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా ఏపీలోని 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ అవడంతో అనుమానం వచ్చి, రీవెరిఫికేషన్ చేయించగా 96 మార్కులు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.