ఏపీ సర్కార్ కాపు మహిళల కోసం సరికొత్త స్కీమును తీసుకురానుంది. గ్రుహిణి అనే పేరుతో ఈస్కీము ద్వారా ఒక్కొక్కరికీ రూ. 15వేలు ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించారు.
దీనికి సుమారు రూ. 400కోట్లు అవసరమని అంచనా వేశారు. గతంలో చంద్రబాబు సర్కార్ కాపు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. అయితే ఈ స్కీము పై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ స్కీమ్ మహిళా సాధికారతకు ఒక ముందుడుగు అవుతుంది. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ కొత్త స్కీముపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేత్రుత్వంలోని కూటమి సర్కార్ కాపు సంక్షేమానికి రూ. 4,600కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాదిలో వాటి ఫలితాలను చూపిస్తామని తెలిపారు.
గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు. గత సర్కార్ హయాంలో వైఎస్సార్ కాపు నేస్తం స్కీమును అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీములో భాగంగా లబ్దిదారులకు ప్రభుత్వం ఏటా రూ. 15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ. 75వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఈ స్కీము ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా రూ. 15వేల చొప్పున సాయం అందించారు. ఇప్పుడు కూటమి సర్కార్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తుంది. అయితే త్వరలోనే కాపు మహిళలకు ఆర్థిక చేయూతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
2014 నుంచి ఏపీ సర్కార్ కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా లోన్స్, సంక్షేమ పథకాలతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు కూడా చేస్తున్నారు. కూటమి సర్కార్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. కాపు మహిళల కోసం ఈ స్కీమును అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కొత్త పల్లి సుబ్బారాయుడు ఉన్నారు.
































