ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. అలా చేస్తే మీ జీతంలో కోత పడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది కలలు కంటూ ఉంటారు అయితే కొంతమంది కలలు కానీ పట్టుదలతో సాధించిన తర్వాత కొన్ని తప్పులు చేయడం వల్ల ఉద్యోగం నుంచి కొన్ని సందర్భాలలో సస్పెండ్ అవుతూ ఉంటారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇలా సస్పెండ్ అయిన వారికి భారీ షాక్ ఇవ్వబోతోంది వాటి గురించి చూద్దాం.


ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కానీ.. డిసిప్లనరీ యాక్షన్ కీ సంబంధించిన దాంట్లో కొన్ని రూల్స్ ఓకే కానీ.. డిస్మిస్ అయితే మాత్రం వాళ్లకి ఇక జీతాలు రావు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. ప్రభుత్వ రంగాలకు సంబంధించిన పిఎస్యు కి సంబంధించినటువంటి ఉద్యోగుల పెన్షన్ నిబంధనలో కేంద్రం కీలక మార్పులను చోటుచేసుకునేలా చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్న సమయంలో డిస్మిస్ అయినా,మధ్యలో తొలగింపును గురైనప్పటికీ అతనికి రిటైర్మెంట్ ప్రయోజనాలు లభించవని తేల్చి చెప్పింది.

అయితే ఆ ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపు పరిపాలన శాఖ కొనసాగిస్తుంది.. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ .. 2021లో మార్పులు చేసి.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ అమెండ్మెంట్ రూల్స్ 2025 తీసుకువచ్చారు.. ఈ కొత్త నిబంధనలు ఈనెల 22 అమలు కాబోతున్నాయని తెలియజేస్తున్నారు. సర్వీస్ లో ఉన్నప్పుడు మధ్యలో ఎవరైనా దుష్ప్రవర్తన వల్ల తొలగింపులకు గురైతే.. ఆ ఉద్యోగి పదవి విరమణ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ ని కోల్పోవాల్సి వస్తుందట. అయితే గతంలో ఇలాంటి అవకాశం లేదు.. మధ్యలో డిస్మిస్ అయినా సరే.. పదవి విరమణ తర్వాత యధావిధిగా వారి ప్రయోజనాలు అందేవి.

2003 డిసెంబర్ 31 కంటే ముందుగా నియమయితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021 వర్తిస్తుందంటూ తెలియజేశారు. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్ ,ఐపీఎస్ వంటి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంటుందట. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెద్ద షాకే అని చెప్పవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.