ఈ రోజే OTT లో 7 సినిమాలు – 4 చాలా ప్రత్యేకమైనవి – 3 తెలుగులో ఆసక్తికరమైనవి – ఇక్కడ చూడండి

టీటీలోకి ఇవాళ (మే 29) ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్ సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.


నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌ వంటి వాటిలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

హిట్ 3 ఓటీటీ

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, హీరోగా చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నెల రోజులు కాకుండానే హిట్ 3 ఓటీటీలోకి వచ్చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ్టీ (మే 29) నుంచి హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ రిలీజ్ అయింది. హిట్ ది థర్డ్ కేస్ ఓటీటీ రిలీజ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

మ్యాడ్ యూనికార్న్ ఓటీటీ

డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన థాయి డ్రామా వెబ్ సిరీస్ మ్యాడ్ యూనికార్న్. నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ మ్యాడ్ యూనికార్న్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థాయితోపాటు ఇంగ్లీష్ భాషలో మ్యాడ్ యూనికార్న్ ఓటీటీ రిలీజ్ అయింది. కొరియర్ స్టార్టప్ సర్వీస్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగనుంది.

డిపార్ట్‌మెంట్ క్యూ ఓటీటీ

బ్రిటీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిపార్ట్‌మెట్. క్యూ (Dept. Q). ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.3 రేటింగ్ సాధించుకున్న డిపార్ట్‌మెంట్‌. క్యూ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిపార్ట్‌మెంట్.క్యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిపార్ట్‌మెంట్. క్యూ ఓటీటీ రిలీజ్ అయింది.

క్రిమినల్ జస్టీస్ సీజన్ 4 ఓటీటీ

హిందీలో సూపర్ హిట్ అయిన ఓటీటీ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టీస్. క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో క్రిమినల్ జస్టీస్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ అయింది.

బాలీవుడ్ పాపులర్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ రోల్ చేసిన క్రిమినల్ జస్టీస్ 4 హాట్‌స్టార్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది బెటర్ సిస్టర్ ఓటీటీ

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు అవుతోన్న ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ది బెటర్ సిస్టర్. అమెరికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన బెటర్ సిస్టర్ 8 ఎపిసోడ్స్‌తో ఇంగ్లీష్ భాషలో అమెజాన్ ప్రైమ్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఇల్ల్టీ ఓటీటీ

పంజాబీ భాషలో రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన సినిమా ఇల్ల్టీ (Illti). ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా చౌపల్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇల్ల్టీ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 6.9 రేటింగ్ వచ్చింది.

జిలా మహేంద్రగర్ ఓటీటీ

క్రైమ్, రాజకీయాలు అంశాలతో తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ జిలా మహేంద్రగర్. హర్యానాలో తెరకెక్కిన ఈ సిరీస్ నేటి నుంచి చౌపల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

ఇదిలా ఉంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఏడింటిల్లో హిట్ 3, డిపార్ట్‌మెంట్.క్యూ, క్రిమినల్ జస్టిస్ 4, ఇల్ల్టీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక వీటిలో హిట్ 3, డిపార్ట్‌మెంట్.క్యూ, క్రిమినల్ జస్టిస్ 4 మూడు తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.