AP DSC: రేపటి నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు

 ఏపీ డీఎస్సీకి సంబంధించి కౌంట్​డౌన్​మొదలైంది. షెడ్యూలు ప్రకారం రేపటి నుంచి (శుక్రవారం) అభ్యర్థులకు హాల్​టికెట్లు (Hall tickets) అందుబాటులోకి రానున్నాయి.


పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును ఈ రోజు ప్రకటిస్తారని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో 16347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షెడ్యూలు ప్రకారం ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు మాక్​టెస్టులను (Mock Test) అప్​డేట్​చేశారు.

ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 30 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు (Online Exams) జూన్‌ 6 నుంచి జులై 6 వరకు నిర్వహిం చనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరిస్తారు.

అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్ష వాయిదా వేయాలంటూ కొందరు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్​చేస్తున్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) 2025 షెడ్యూల్‌ యథా విధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు సైతం గత వారంలో స్పష్టం చేసింది. దీంతో పరీక్షల వాయిదా దాదాపు లేనట్లేనని స్పష్టమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.