ఇద్దరు సంపాదిస్తే ప్రయోజనం ఏమిటి? ఒంటరిగా సంపాదించే జంటలు మాత్రమే సంతోషంగా ఉంటారు.

ఈ రోజుల్లో ఒక్కరే జాబ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి! భార్యా భర్తలిద్దరూ తలో ఉద్యోగం చూసుకుంటే డబుల్ ఇన్‌కంతో హ్యాపీగా బతికేయవచ్చు అంటుంటారు చాలామంది.


ఇద్దరి సంపాదనతో వారి కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని కూడా చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటున్నట్లు తేల్చింది ఓ అధ్యయనం. పైగా డబుల్ ఇన్‌కం కలిగిన జంటలు, సింగిల్ ఇన్‌కం కలిగిన జంటలతో పోలిస్తే అధికంగా సఫర్ అవుతున్నారని, వీరి కుటుంబంలో ఒక విధమైన గందరగోళం నెలకొంటున్నదని పేర్కొన్నది. ముఖ్యంగా మహిళలు అధికంగా సఫర్ అవుతున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్(University of California, Los Angeles)కు చెందిన పరిశోధకులు, భార్యా భర్తలు ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది జంటలను, అలాగే భార్య లేదా భర్త ఎవరో ఒక్కరే ఉద్యోగం చేస్తున్న మరికొంత మంది జంటలను రెండు గ్రూపులుగా విభజించారు. డబుల్ ఇన్‌కంవల్ల, అలాగే సింగిల్ ఇన్‌కంవల్ల ఆయా కుటుంబాల్లో మానసిక శ్రేయస్సు, ముఖ్యంగా హ్యాపీనెస్ వంటివి ఎలా ఉంటున్నాయో అంచనా వేశారు.

1200 మంది చొప్పున డబుల్ అండ్ సింగిల్‌ ఇన్ కం జంటలను విశ్లేషించిన రీసెర్చర్స్ ఫైనల్లీ సింగిల్ ఇన్‌కం కలిగిన జంటలే తమ జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని, డబుల్ ఇన్‌కం కలిగిన జంటల్లో అధిక మానసిక ఒత్తిడి, లోన్లీనెస్, గందరగోళం, యాంగ్జైటీస్ వంటివి అధికంగా ఉంటున్నాయని తేల్చారు. ఎందుకంటే రోజంతా అలసిపోవడం, ఇతర పనులు చేసుకోవడానికి ఓపికలేకపోవడం వంటివి డబుల్ ఇన్‌కం జంటల్లో అతి ఆలోచనలకు దారితీస్తున్నాయి. ఇది రాత్రి సమయాల్లో ఒత్తిడి హర్మోన్ అయిన అధిక కార్టిసాల్ స్థాయిలకు కారణం అవుతోంది. దీర్ఘకాలంపాటు ఈ పరిస్థితిని అనుభవించే వారు లోన్లీనెస్, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యల బారిన కూడా పడుతున్నారని గుర్తించారు.

డబుల్ ఇన్‌కం ఫ్యామిలీస్‌లో అధిక ఒత్తిడి కారణంగా భార్యా భర్తలిద్దరూ సఫర్ అవుతుండటం పరోక్షంగా వారి కుటుంబంపై కూడా ప్రభావం చూపుతోంది. వివిధ ఇంటి పనుల నిర్వహణ, పిల్లల చదువు, కొత్తగా పెళ్లయిన వారైతే సంతాన సాఫల్య ప్రయత్నాలు వంటివి డబుల్ ఇన్‌కం జంటలు సక్రమంగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాయి. చేసుకున్నా సక్సెస్ రేట్ తగ్గుతోంది. అంతేకాకుండా వీరిలో భావోద్వేగ ప్రతిస్పందనలు, ఎమోషనల్ సపోర్ట్ నిర్వహణ సక్రమంగా ఉండకపోవడంవల్ల చివరికి కొందరిలో స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తోంది.

ఇక పురుషాధిక్యత లేదా పితృస్వామిక భావజాలం కారణంగా డబుల్ ఇన్‌కం జంటలలో మహిళలైతే మరింత సఫర్ అవుతున్నారని పరిశోధకులు గుర్తించారు. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులే అయినా ఇక్కడ భార్య ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి పనులు, కుటుంబ నిర్వహణ వంటి అదనపు బాధ్యతల కారణంగా అధిక ఒత్తిడిని అనుభవించడం మెజార్టీ జంటలలో కామన్ అయిపోయింది. ఈ పరిస్థితి మహిళల్లో మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తోంది. దీంతో పోలిస్తే సింగిల్ ఇన్‌కం, అంటే భర్త లేదా భార్య మాత్రమే ఉద్యోగం చేసే జంటలు, వారి కుటుంబం సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే వీరిలో ప్లాన్ ప్రకారం కుటుంబ నిర్వహణ, ఉద్యోగం వంటి వాటిలో పని విభజన ఉంటోంది. ఇది పాజిటివ్ ఆలోచనలకు, సానుకూల నిర్ణయాలకు దారితీస్తోంది. దీంతో జంటలలో ఇద్దరూ ఒకేసారి అధిక ఒత్తిడిని అనుభవించే పరిస్థితి ఉండటంలేదు. ముఖ్యంగా ఒకరు అలసిపోయినప్పుడు మరొకరు ఎమోషనల్ సపోర్ట్‌ అందించడం ఇక్కడ మరింత ఆనందానికి దారితీస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.