కేంద్రం అద్భుతమైన స్కీమ్.. కేవలం వడ్డీనే రూ.12 లక్షలు పొందొచ్చు..

రిటైర్ అయిపోయిన తర్వాత చాలామందికి నెల నెల ఆదాయం ఉండదు. రిటైర్ అయిన కొంతమంది బ్యాంకులలో డబ్బులు పెట్టుకుంటారు. అలాగే మరి కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం ఒక అద్భుతమైన పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పెట్టుబడి స్కీమ్ లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు కేవలం వడ్డీనే రూ.12 లక్షల రూపాయలు వస్తాయి. సీనియర్ సిటిజన్స్ కు ఇది చాలా మంచి పథకం. ఈ పెట్టుబడి పథకంలో మీరు త్రైమాసికం వడ్డీ రూపంలో భారీగా రిటర్న్స్ పొందవచ్చు. వయసు మీద పడుతున్న వారు ఆర్థికంగా వేరొకరి మీద ఆధార పడాల్సిన అవసరం లేకుండా మీరు ఈ సురక్షితమైన పథకంలో మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో 8.2% వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలుస్తుంది.


మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు మీద మీకు త్రైమాసికంగా వడ్డీ లభిస్తుంది. మీరు ఈ డబ్బులను మీ నిత్యవసర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. మిగిలిన డబ్బులను పొదుపు చేసి అవసరమైన సమయాలలో వాడుకోవచ్చు. అయితే మీరు ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలు నుంచి రూ.30 లక్షల వరకు కూడా పెట్టుబడి చేసుకోవచ్చు. ఈ స్కీం లో మీరు ఐదు సంవత్సరాలకు గాను రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఏకంగా రూ.12,30,000 వడ్డీ అందుతుంది. వేరే పెట్టుబడి పథకాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు.

ఒకవేళ మీరు ఈ పెట్టుబడి పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.61,500 వడ్డీ అందుకోవచ్చు. ఐదేళ్లపాటు ఈ పథకంలో మీరు కొనసాగించవచ్చు. మెచ్యూరిటీ సమయం పూర్తి అయిన తర్వాత ఈ ఖాతాను మీరు మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో మీ వడ్డీ ఆదాయం మరింత పెరుగుతుంది. అలాగే ఈ పథకం మీద మీరు సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు. అంటే మీరు మెచ్యూరిటీ సమయానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.