భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక నమ్మకాలు ఎప్పటి నుంచో ప్రజల జీననంలో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో రుద్రాక్ష, తులసి, స్పటిక మాలలతోపాటు కరుంగలి మాల గురించి ఇటీవల కాలంలో చర్చ ఎక్కువైంది.
ఈ మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు, అయితే ఈ మాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర మాలలతో పోలిస్తే దీనికి ప్రత్యేక స్థానం ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ కథనంలో కరుంగలి మాల ధరించేటప్డుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర మాలలతో దాని తేడాలు, దీని ప్రాముఖ్యతను వివరంగా చూద్దాం.
కరుంగలి మాల అంటే ఏంటీ?
కరుంగలి మాల జమ్మి జెట్టు నుంచి తయారు అవుతుంది. దీనిని ఆంగ్లంలో ఎబోనీ అని అంటారు. ఈ చెట్టు కలప నల్లగా, గట్టిగా బరువుగా ఉంటుంది. సాధారణంగా 108 పూసలతో తయారయ్యే ఈ మాలలు తమిళనాడు, కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మాల ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, వాస్తుల దోషాలు, వ్యాపారాభివృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. ఈ మాలను సినీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ధరించడంతో దీని ప్రాచుర్యం బాగా పెరిగింది.
కరుంగలి మాల ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరుంగలి మాల ఒక పవిత్రమైన హారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించాలి.
మద్యం, మాంసాహారం, శృంగార కార్యకలాపాలు నిషేధం:- కరుంగలి మాల ధరించినప్పుడు మద్యపాన, మాంసాహారం తీసుకోకూడదు. అలాగనే శృంగారంలో పాల్గొనకూడదు. ఇటువంటి చర్యలు మాలలోని శక్తిని క్షీణింపజేస్తాయి. అది వినియోగానికి పనికి రాకుండా పోవచ్చు అని నమ్ముతారు. ఒక వేళ బయట మాంసాహారం తినవలసి వస్తే మాలను తీసి ఒక కరవర్లో ఉంచి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత ధరించాలి.
రాత్రి సమయంలో తీసివేయాలి:- రాత్రి నిద్రపోయేటప్పుడు కరుంగలి మాలను తీసివేయాలి. దీనిని పూజా మందిరంలో భద్రపరిచి ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించాలి. ఈ నియమం శృంగార ఆలోచనలు కార్యకలాపాల సమయంలో మాల శక్తిని కాపాడటానికి ఉపయోగపడుతుంది.
నెలసరి మయంలో జాగ్రత్త:- స్త్రీలు నెలసరి సమయంలో మాలను తీసివేయాలి. ఈ సమయంలో దినిని పూజామందిరంలో ఉంచి నెలసరి పూర్తిన అయిన ఆరో రోజు ఉదయం స్నాం చేసిన తర్వాత మళ్లీ ధరించాలి. అయితే కొందరు నిపుణులు నెలసరి సహజ ప్రక్రియ కాబట్టి ఈ సమయంలో ధరించవచ్చని చెబుతున్నారు. కానీ మనసు నిర్మలంగా ఉండాలని సూచిస్తున్నారు.
అభిషేకం తర్వాత ధరించడం:- మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంలో ఉంచిన కరుంగలి మాలను మరో మంగళవారం రోజు ధరించి శుభప్రదంగా భావిస్తారు. ఈ అభిషేకం మాలకు అదనపు శక్తిని, పవిత్రతను జోడిస్తుందని నమ్ముతారు.
స్వచ్ఛత, ధర్మం పాటించడం: కరుంగలి మాల ధరించినప్పుడు శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. మాల ధరించినప్పుడు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలి.
ఇతర మాలలతో కురంగలి మాలకు ఉన్న తేడా ఏంటీ?
కరుంగలి మాల ఇతర మాలలతో పోల్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.
మూలం, తయారీ: రుద్రాక్ష మాల రుద్రాక్ష చెట్టు గింజలతో, తులసి మాల తులసి చెట్టు కాడంతో, స్పటిక మాల స్పటిక రాళ్లతో తయారవుతాయి. కానీ కరుంగలి మాల జమ్మిచెట్టు కలపతో తయారవుతుంది. ఈ చెట్టు విద్యుదయస్కాంత శక్తిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇతర మాలలకు ఉండదు.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు:- రుద్రాక్ష మాల శివ భక్తులకు, తులసి మాల విష్ణు భక్తులకు, స్పటిక మాల ధ్యానం, మానసిక స్వచ్ఛత కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కరుంగలి మాల అంగారక గ్రహ దోషాలు నివారణకు, వాస్తు దోషాలు తొలగింపునకు, దృష్టి దోష నివారణకు ఉపయోగిస్తారని అంటారు. సుబ్రహ్మణ్యం స్వామి జపం చేసేవారికి అదనపు ఫలితాలు ఇస్తుందని మరికొందరి నమ్మకం.
ఆరోగ్య ప్రయోజనాలు: కరుంగలి మాల రేడియేషన్ను గ్రహించే గుణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతారు. ఈ లక్షణం రుద్రాక్ష, తులసి మాలకు ఈ శక్తి లేదని అంటారు. అలాగే కరుంగలి చెట్టు వేరు, బెరడు నుంచి తీసిన కషాయం మధుమేహం, గర్భాశయ సమస్యలకు, అల్సర్ సమస్యను పరిష్కారిస్తుందనే ప్రచారం ఉంది.






























