మీరు ప్రతిరోజూ తినే ఈ 5 ఆహారాలు అధిక జుట్టు రాలడానికి నిజమైన కారణాలు

మనం రెగ్యులర్ గా తీసుకుని ఒక ఐదు ఆహారాలు జుట్టు విపరీతంగా రాలడానికి అసలు కారణాలు అవుతాయి. ప్రధానంగా ఈ కాలంలో చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.


ఆడ, మగ అనే తేడా లేకుండా జుట్టు విపరీతంగా రాలుతుంది. డబ్బులు ఖర్చు పెట్టి మరీ షాంపులు ఇతర హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. అయినా కానీ, సరైన డైట్‌ పాటించకపోవడం వల్ల హెయిర్‌ ఫాల్ అవుతుంది.

చక్కెర..
ఇది లేనిదే ఏ ఇల్లు ఉండదు. ప్రతిరోజు చక్కెర అధికంగా తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్య వస్తాయి. హెయిర్ ఫోలిక్స్ వీక్ గా మార్చేస్తాయి. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జుట్టు కుదుళ్ల నుంచి బలహీన పడిపోతుంది. దీంతో హెయిర్ ఫాల్ విపరీతంగా పెరిగి జుట్టు సన్నగా మారిపోతుంది.

ఫ్రై చేసిన ఆహారాలు..
కొందరు ఫ్రై చేసిన ఆహారాలు అతిగా తీసుకుంటారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది అనారోగ్యకరం. ఇది హెయిర్ ఫాలికల్స్ బలహీనపరుస్తుంది. దీంతో కుదుళ్ల ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. దీంతో చుండ్రు కూడా విపరీతంగా పేరుకుపోయి బ్లడ్ సర్క్యూలేషన్ తక్కువ అవుతుంది. తద్వారా హెయిర్ బాగా ఊడిపోతుంది.

కార్బోహైడ్రేట్స్..
కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ బ్రెడ్, పాస్తా వంటివి చక్కెరగా మన శరీరంలో మారిపోతాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగిపోతాయి. దీంతో నొప్పులు. మంట సమస్య కూడా వస్తుంది. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి కుంటు పడేలా చేస్తుంది. బ్లడ్‌ సర్క్యులేషన్‌ కుంటుబడిపోతుంది తద్వారా జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

విటమిన్ ఏ..
విటమిన్‌ ఏ కణాల పెరుగుదలకు సహాయపడతాయి. అయితే విటమిన్ ఏ సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫోలికల్ డ్యామేజ్ అయిపోతాయి. ఇది హార్మోన్ అసమతులతకు కూడా దారితీస్తుంది. తద్వారా జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వంటివి తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యం కుంటుపడుతుంది. రెగ్యులర్‌గా ఇవి తీసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ కూడా అవుతుంది. వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.