మీ మార్నింగ్‌ని హెల్తీగా స్టార్ట్ చేయకపోయినా పర్లేదు కానీ.. కొన్ని మిస్టేక్స్తో రిప్లేస్ చేయడం వల్ల మీ హార్మోన్స్ దెబ్బతింటాయని చెప్తున్నారు నిపుణులు.
హార్మోన్ల సమస్యలనేవి కేవలం ఆడవారినే కాదు.. మగవారిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయవద్దని సూచిస్తున్నారు. తెలియకుండా చేసే ఆ తప్పులు ఏంటో.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం.
కార్టిసాల్, ఇన్సులిన్, థైరాయిడ్ హార్మోన్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్స్ వెలుతురు, ఆహారం, ఒత్తిడిపై డిపెండ్ అయి ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామునే ఇవి రెస్పాండ్ అవుతాయి. మీరు నిద్రలేచిన గంట వరకు వీటిని మీరు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో కచ్చితంగా తెలుసుకోవాలి. లేకుంటే మీ శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఫోన్
నిద్రలేవగానే చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఫోన్ చూడడం. ఉదయాన్నే ఇలా ఫోన్ చూడడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్పైక్ అవుతుంది. ఇది డోపమైన క్రాష్‌కి కారణం అవుతుంది. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీర్ఘకాలం ఇలా కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడకుండా డోర్స్ లేదా విండోస్ ఓపేన్ చేసి బయటి సన్లైట్ని చూడాలి. రెండు నిమిషాలు ఎండలో లేదా డే లైట్లో ఉంటే కార్టిసాల్ కంట్రోల్లో ఉంటుంది. నిద్ర సమస్యలు దూరమవుతాయి. శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది.
బ్రేక్‌ఫాస్ట్
రోజులో మీరు మొదటిగా తీసుకునే ఫుడ్ రక్తంలోని బ్లడ్ షుగర్‌ని, ఇన్సులిన్ని, రోజు మొత్తంలోని ఫుడ్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ని అస్సలు స్కిప్ చేయకూడదు. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ ఇన్సులిన్ స్పైక్‌ని పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఫ్యాట్ స్టోరేజ్‌ని తగ్గిస్తుంది.
మీరు నిద్రలేచిన గంటలోపు శరీరానికి 30 గ్రాముల ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందిచడం మంచిది. దీనివల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. క్రేవింగ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. కార్బ్స్ ఎక్కువగా ప్రోటీన్ తక్కువగా ఉండే ఫుడ్ జోలికి వెళ్లకూడదు. గుడ్లు, అవకాడో, గ్రీన్స్ వంటి వాటిలో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
కాఫీ
పరగడుపునే కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీరు దానిని వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇలా తాగడం వల్ల కార్టిసాల్, కడుపులో యాసిడ్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. దీనివల్ల నీరసంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు తాగకూడదట.
కాఫీ తాగాలనుకుంటే ఏదైనా ఫుడ్ శరీరానికి అందించిన తర్వాత దీనిని తీసుకోవచ్చు. ప్రోటీన్ ఫుడ్‌తో కలిపి బ్లాక్ కాఫీ తాగితే మరీ మంచిది. అలా రోజు మొత్తం కాఫీ తాగకూడదు.
యాక్టివిటీ
ఉదయం లేచిన వెంటనే శరీరానికి కాస్తైనా పని చెప్పాలి. ఫిజికల్‌గా మూవ్ అవుతున్నప్పుడు కార్టిసాల్, ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ వంటివి రెగ్యులేట్ అవుతాయి.
కాబట్టి నిద్ర లేచిన తర్వాత మీకు ఎక్కువ టైమ్ లేకపోయినా 5 నుంచి 10 నిమిషాలు శరీరాన్ని స్ట్రైచ్ చేయడం, వాకింగ్ చేయడం, డీప్ బ్రీతింగ్ వంటివి తీసుకోవడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సన్‌లైట్‌లో చేస్తే మరీ మంచిది.
రోజు మొత్తంలో మీ ఆరోగ్యాన్ని సెట్ చేసే సరైన సమయం ఏదైనా ఉందా అంటే అది మీరు నిద్ర లేచిన తర్వాత మొదటి గంటనే. ఆ సమయాన్ని మీరు ఎంత హెల్తీగా, యాక్టివ్‌గా స్టార్ట్ చేస్తే మీరు అంత హెల్తీగా, ఫోకస్‌గా ఉండగలుగుతారని గుర్తించుకోవాలి.



































