కొత్త పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 12న రూ.4 వేల అందజేత

 ఏపీ(Ap)లో కొత్తగా పింఛన్(Pension) కోసం దరఖాస్తు చేసిన పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 12న రూ. 4 వేలు అంజేయనున్నట్లు ప్రకటించింది.


ఈ మేరకు సెర్ప్ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతవులు తదితర అర్హులైన పేదలు కొత్త పింఛన్లు కోసం దరఖాస్తు చేశారు. ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో సంబంధింత దరఖాస్తులను అందజేశారు.

అలా రాష్ట్రవ్యాప్తంగా 71,380 మంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. వీరందరికీ జూన్ నెల నుంచి పింఛన్ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేసింది. కొత్త పింఛన్ దారులకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా రూ.35 కోట్లు అదనపు భారం పడనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.