7వ తరగతి పాసైతే ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల వరకు జీతం.. పూర్తి వివరాలు

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ కోచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) తన సంస్థలో ఖాళీగా ఉన్న వర్క్‌మెన్ కేటగిరీలోని పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన జరగనున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని CSL అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలో పని చేసే అవకాశం కావడంతో నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. మరీ పోస్టులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే..

పోస్టుల వివరాలు:

* మొత్తం ఖాళీలు- 25

* ఫైర్‌మెన్ (Fireman)- 15 పోస్టులు

* సెమీ స్కిల్డ్‌ రిగ్గర్‌ (Semi Skilled Rigger)- 9 పోస్టులు

* కుక్‌ (Cook)- 1 పోస్టు

అర్హతలు:

* కనీసంగా ఎస్‌ఎస్‌ఎల్‌సీ (SSLC), లేదా ఆరో తరగతి, ఏడో తరగతి పాసై ఉండాలి.

* సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం తప్పనిసరి.

* భాషా నైపుణ్యాలు, ముఖ్యంగా మలయాళం లేదా ఇంగ్లిష్/హిందీ భాషలో కొంత కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 20-06-2025 నాటికి గరిష్ఠంగా 40 ఏళ్లు మించరాదు.

స్టైపెండ్: నెలకు కనిష్ఠం రూ.21,300 నుంచి గరిష్ఠంగా రూ.69,840 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

* అభ్యర్థులను రాత పరీక్ష ఫేజ్ 1, ఫేజ్ 2 పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్ష విధానం, సిలబస్ తదితర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయబడుతుంది.

దరఖాస్తుల చివరి తేదీ: 20 జూన్ 2025

అధికారిక వెబ్‌సైట్:https://cochinshipyard.in

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.